MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- ఉదయనిధి అరెస్ట్‌పై సీఎం విజయ్ టార్గెట్‌గా స్టాలిన్ విమర్శలు..
- డమ్మీ సీఎం, రీల్స్ క్రియేటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు..
- కావేరీ జలాల విషయంలో ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు అరెస్ట్..
- టీవీకే అహంకారం, పతనానికి దారి తీస్తుందని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తమిళనాడులో సంచలనంగా మారింది. సినీ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై మంగళవారం ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. చివరకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో రిలీజ్ చేశారు. తనయుడి అరెస్ట్‌పై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం విజయ్ ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అని, డమ్మీ సీఎం, రీల్స్ క్రియేటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉదయనిధి అరెస్ట్ వెనక రాజకీయ దురుద్దేశం ఉందని స్టాలిన్ ఆరోపించారు. కావేజీ జలాల అంశం, కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టును అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ అరెస్ట్ జరిగిందని అన్నారు. కావేరీ నీటిని తీసుకురాలేదేరి, మేకేదాటు ప్రాజెక్టును అడ్డుకోలేని డమ్మీ సీఎం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే, మంత్రులు విజయ్ సినిమా చూసి కన్నీరు పెట్టుకుంటున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. తమిళనాడులో ‘జోకర్ కేబినెట్’ నడుస్తోందని వ్యాఖ్యానించారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ఒక రోజు ముందు అరెస్ట్ జరగడం వెనక రాజకీయ ఉద్దేశం ఉందని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తుందని స్టాలిన్ ఆరోపించారు. ఇది ‘ఫాసిస్ట్ ప్రభుత్వం’అని అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి విజయ్ ‘‘రీల్స్ క్రియేటర్’’లా తిరుగుతున్నారని విమర్శించారు. అహంకారం నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!