Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Love Story: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ ప్రయాణం గురించి తెలిసిందే. అయితే ఈ ప్రేమకథ చాలా కాలం పాటు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా కొనసాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తమ ప్రేమ, వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పరిచయం 2017లో ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో మొదలైంది. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరూ ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. దాదాపు ఏడేళ్ల పాటు తమ రిలేషన్‌షిప్‌ను గోప్యంగా కొనసాగించిన ఈ జంట.. చివరకు 2023లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అదే ఏడాది జూన్ 8న ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత నవంబర్ 1న ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
తమ రిలేషన్‌షిప్‌ను ఎందుకు రహస్యంగా ఉంచారనే విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంలోకి ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఒకసారి విషయం బయటకు వస్తే అనవసరమైన చర్చలు, ఊహాగానాలు తమపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించామని చెప్పారు. తమ బంధంపై నమ్మకం వచ్చిన తర్వాతే కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పామని వరుణ్ వెల్లడించారు. మొదట తన తల్లికి ఈ విషయం చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తమకు మద్దతు ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు.
Also Read
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!