Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Ticket Prices: టాలీవుడ్లో సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో రెవెన్యూ పంపిణీ (పర్సెంటేజ్) విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ అంశాన్ని పరిశీలిస్తున్న పాత కమిటీని ఫిల్మ్ ఛాంబర్ పూర్తిగా రద్దు చేసింది. దాని స్థానంలో ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ అధ్యక్షతన మొత్తం తొమ్మిది మంది సభ్యులతో కొత్త కమిటీని నియమించింది. పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ ధరలు, థియేటర్లలో అమలవుతున్న పర్సెంటేజ్ విధానం వంటి కీలక అంశాలపై ఈ కమిటీ విస్తృతంగా చర్చించనుంది.
అయితే ఈ కమిటీ తన నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలనే విషయంలో ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి గడువు విధించలేదు. తొందరపాటు నిర్ణయాల కంటే అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి, పరిశ్రమకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే పరిష్కారాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో సమయం తీసుకోవాలని కమిటీకి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల టికెట్ ధరలు, రెవెన్యూ షేరింగ్ విధానంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త కమిటీ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంది. కమిటీ సమర్పించే సిఫార్సుల ఆధారంగా భవిష్యత్తులో టాలీవుడ్లో టికెట్ ధరలు, పర్సెంటేజ్ విధానానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు రూపొందే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!