Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin Case: తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధించిన కేసు వ్యవహారంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా, పోలీసులు ఆయనను చెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదైన తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ వద్ద డీఎంకే, టీవీకే నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడడంతో అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఉదయనిధిని చెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అయితే, తనపై కేసు ఎక్కడ నమోదు చేశారో అదే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళితేనే దిగుతానని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. దీంతో ఆయన పోలీస్ వ్యాన్లోనే కూర్చుని ఉండిపోయారు. పోలీసులు పలుమార్లు నచ్చజెప్పినా, సుమారు అరగంటపాటు ఆయన వ్యాన్ దిగేందుకు నిరాకరించినట్లు సమాచారం. తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పార్టీ కార్యకర్తలు ఉండటంతో అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఉదయనిధికి వివరించారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుతూ ఆయనతో చర్చలు కొనసాగించారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
చివరకు పోలీసుల విజ్ఞప్తిని అంగీకరించిన ఉదయనిధి స్టాలిన్ వ్యాన్ నుంచి దిగారు. అనంతరం అక్కడ వేచి ఉన్న పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసిన ఆయన, చెంగిపట్టి పోలీస్ స్టేషన్లోకి వెళ్లి విచారణకు హాజరయ్యారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. కాగా, సీఎం విజయ్-సినీనటి త్రిషను ఉద్దేశిస్తూ.. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీయగా.. పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, ఉదయనిధికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన మద్రాస్ హైకోర్టు.. ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలంటూ ఉదయనిధికి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. మరోవైపు.. సీఎం విజయ్.. ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు డీఎంకే అధినేత స్టాలిన్..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!