Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఈవెంట్లలో యాంకరింగ్ చేయడం అంటే మాటలు కాదు, అది కత్తి మీద సాము లాంటి పనే. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను తన అద్భుతమైన స్పాంటేనిటీ, అందం సహా హోస్టింగ్ స్కిల్స్‌తో ఓ ఊపు ఊపేస్తోంది ఒక కొత్త ముఖం. ఆమె మరెవరో కాదు.. చర్మిల నల్లూరి. యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, తన అందం, అణుకువతో ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత కం దర్శకుడు ఎం.ఎస్. రాజు సైతం “మా సినిమాలో హీరోయిన్గా నటిస్తావా?” అని అడిగేలా చేసుకుంది. ప్రస్తుతం తెలుగు యువత మోస్ట్ ఫేవరెట్ పర్సన్‌గా మారిపోయిన చర్మిల నల్లూరి తన సక్సెస్ జర్నీ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఎన్టీవీ వెబ్‌తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
విజయవాడ to టాలీవుడ్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి పెరిగిన చర్మిల నల్లూరి విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. స్థానికంగా ఉన్న ప్రముఖ కేఎల్ యూనివర్సిటీలో ఆమె కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత ఆమెకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. అయితే ఆ ఉద్యోగంలో చేరడానికి కొంత సమయం ఉండడంతో, ఆ ఖాళీ సమయంలో విజయవాడ రెడ్ ఎఫ్ఎమ్లో ఆర్జే (RJ) గా కెరీర్ ప్రారంభించారు. అనుకోకుండా మొదలైన ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రెడ్ ఎఫ్ఎమ్లో ఆర్జేగా పనిచేస్తున్న సమయంలో ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ‘చాయ్ బిస్కెట్’ ఆమెను సంప్రదించింది. వారు సిద్ధం చేసిన ఒక కొత్త యాప్ లాంచ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించాలని కోరారు. అలా మొదటిసారిగా మైక్ పట్టుకున్న చర్మిల, తన అద్భుతమైన ప్రెజెంటేషన్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
తొలి సినిమా ఈవెంట్ తోనే లైఫ్ టర్న్..
ఆమె చేసిన మొట్టమొదటి సినిమా ఈవెంట్ ‘రావు బహదూర్’ సాంగ్ లాంచ్ వేడుక. ఆ కార్యక్రమంలో ఆమె చేసిన హోస్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ ఒక్క ఈవెంట్‌తో టాలీవుడ్ మేకర్స్ కన్ను ఆమెపై పడింది. దీంతో వరుసగా సినిమా ఈవెంట్ల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. కెరీర్‌ను సీరియస్‌గా తీసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని, వరుస అవకాశాలతో దూసుకుపోతున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. టాలీవుడ్ ఈవెంట్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చర్మిల నల్లూరి, కేవలం హోస్ట్‌గానే కాకుండా వెండితెరపై హీరోయిన్గా కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది కానీ అదేమీ లేదని అంటోంది ఆమె. ఇక టాలెంట్‌కు తగిన మంచి అవకాశం తోడైతే విజయాలు ఎలా వెతుక్కుంటూ వస్తాయో చెప్పడానికి చర్మిల ప్రయాణమే ఒక చక్కటి ఉదాహరణ!
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!