Manchu Brothers Disputes Came into Light again : తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మంచు వారి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరూ తమ తండ్రి మంచు మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగులో హీరోలుగా పలు సినిమాలు చేశారు, చేస్తున్నారు. అయితే ఆ మధ్య మనసు మనోజ్ కి మంచు విష్ణుకి మధ్య జరిగిన గొడవ మీడియాలో కూడా హైలైట్ అయింది. ఆ తర్వాత అది తాము కలిసి చేస్తున్న ఒక షో కోసం అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ చాలా రోజుల నుంచి ఆ ఇద్దరి మధ్య సఖ్యత లేదనేది టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు ఆ ప్రచారానికి సొంత అన్నదమ్ములే మరోసారి ఊతం ఇచ్చినట్లయింది.
Siddharth: అప్పుడు కండోమ్ తో రోడ్డెక్కింది నేనే.. సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్
అసలు విషయం ఏమిటంటే ఇటీవలే మంచు మనోజ్ కి ఒక పాప పుట్టింది. ఆ పాపకి దేవసేన శోభ ఎంఎం అనే పేరు పెడుతూ ఒక నోట్ రిలీజ్ చేశారు. అయితే ఆ పేరు ఎందుకు పెట్టాం అనేది వివరిస్తూ ఒక లెటర్ రాసి ఆ లెటర్లో తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలాదేవి అక్క మంచు లక్ష్మి సహా మౌనిక రెడ్డి అక్క, తమ్ముడు గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ లేఖలో మంచు విష్ణు గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు తన అన్న విష్ణు గురించి కావాలనే మనోజ్ విస్మరించినట్లు తెలుస్తోంది. అయితే మరొక పక్క ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Much appreciated 🙏. First thanks to my brother @IamSaiDharamTej. Thank you @TelanganaDGP https://t.co/xPJqHUP2Is
— Vishnu Manchu (@iVishnuManchu) July 8, 2024
తెలుగు హీరోలలో మొట్టమొదటగా సాయిధరమ్ తేజ్ ఈ విషయాన్ని ఖండిస్తూ బహిరంగంగా స్పందించాడు. ఆ తర్వాత మంచు మనోజ్ కూడా ఈ విషయం మీద స్పందిస్తూ సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. అయితే సాయి ధరంతేజ్ ని బ్రదర్ అంటూ సంభోదించిన విష్ణు మంచు మనోజ్ అసలు ఈ ట్వీట్ చేసినా సరే తనకేమీ పట్టనట్లే ఉండిపోయాడు. సాయిధరమ్ తేజ్ని అప్రిషియేట్ చేయాలని పేర్కొన్న విష్ణు ఎందుకో మంచు మనోజ్ చేసిన ట్వీట్ని మాత్రం లైట్ తీసుకున్నాడు. దీంతో ఈ కుటుంబంలో ఉన్న విభేదాలను సొంత అన్నదమ్ములే మరోసారి బయట పెట్టుకున్నట్లు అయింది అని చెప్పక తప్పదు.