Nagpur: ‘ టీ ’ ఇవ్వలేదని ఆపరేషన్‌ని మధ్యలో వదిలేసిన డాక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: ఏదో సినిమాలో చెప్పినట్లు ఒక హిందువు ఈశ్వరుడిని, ముస్లిం అల్లాను, క్రిస్టియన్ ఏసు ప్రభువునే ప్రార్థిస్తాడు, కానీ అన్ని మతాల వాళ్లు డాక్టర్‌ని ప్రార్థిస్తారని హీరో డైలాగ్ చెబుతాడు. ఇది నిజం అనారోగ్యంతో వచ్చిన వ్యక్తికి డాక్టరే దేవుడు. ఇలాంటి ఆదర్శప్రాయమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ డాక్టర్ మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ‘టీ’ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది. స్టెరిలేజేషన్ సర్జరీ(వేసక్టమీ)(కుటుంబ నియంత్రణ) మధ్యలో వదిలిసి వెళ్లాడు ఓ డాక్టర్. తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్య నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ప్రభుత్వం ఆస్పత్రిలో 8 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం పిలిచారు. నలుగురు మహిళలకు శస్త్రచికిత్స తర్వాత, డాక్టర్ భాలవి ఆస్పత్రి సిబ్బందిని ఒక కప్పు టీ అడిగాడు, అయితే సిబ్బంది టీ ఇవ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు.
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
Read Also: CM Nitish Kumar: జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు..
అయితే అయితే ఈ ఘటనపై మాట్లాడిన డాక్టర్.. తనకు షుగర్ ఉందని సమయానికి టీ, బిస్కెట్లు కావాలని చెప్పానని, ఇవి లేకుంటే రక్తంలో చెక్కర స్థాయి పడిపోతుందని, బీపీ తగ్గుతుందని, అందుకే అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో నలుగురు మహిళలు అనస్థీషియా మత్తులో ఉన్నారు. ఆపరేషన్ ముందు వీరికి మత్తు మందు ఇచ్చారు. డాక్టర్ ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన విషయాన్ని మహిళ బంధువులు జిల్లా వైద్యాధికారికి చెప్పారు. వెంటనే వేరే వైద్యుడిని ఆస్పత్రి పిలిపించింది. ఈ ఘటనపై నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈఓ సౌమ్యశర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!