Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smartphone Tips: కొత్త స్మార్ట్‌ఫోన్ చేతికి రాగానే పాత ఫోన్‌ను మూలన పడేయడం మనందరికీ అలవాటే. అవుట్‌డేటెడ్ అయిపోయిందనో, సరిగ్గా పనిచేయడం లేదనో దాని జోలికి వెళ్లం. అలా కొన్నాళ్లపాటు బీరువాలోనో, ఏదో ఒక పెట్టెలోనో నలిగిపోయి. ఆ తర్వాత చెత్తలోకి చేరుతుంటుంది. కానీ, ఆ పాత ఫోన్‌తో మీ ఇంట్లోనే ఒక ఉపయోగకరమైన గ్యాడ్జెట్‌ను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? కొత్త డివైజ్ కొనే అవసరం లేకుండానే, మీ ఆఫీస్ పనిని లేదా ల్యాప్‌టాప్ వాడకాన్ని ఈ పాత ఫోన్ చాలా తేలిక చేస్తుంది. ఫోన్ పాతదైపోయి పదే పదే హ్యాంగ్ అవుతుంటే దాంతో ఏం పనిచేయిస్తాం అని మీకు సందేహం రావచ్చు. కానీ, ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఫోన్ ఓవరాల్‌గా స్లో అయినప్పటికీ, దానిలోని హార్డ్‌వేర్ చిన్న చిన్న పనులను నడిపించడానికి ఇప్పటికీ చాలా పవర్‌ఫుల్‌గానే ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా, మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌కు దీనిని ఒక వైర్లెస్ మౌస్‌గా మార్చి వాడుకోవచ్చు. ఒకవేళ మీ ల్యాప్‌టాప్ టచ్‌ప్యాడ్ పాడైనా లేదా ఇంట్లో వైర్లెస్ మౌస్ అందుబాటులో లేకపోయినా, రూపాయి ఖర్చు లేకుండా ఈ పాత ఫోన్‌నే మౌస్లా మార్చేయవచ్చు.
దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీ పాత ఫోన్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లో లభించే ఏదైనా ఒక మంచి ‘వైర్లెస్ మౌస్ (Wireless Mouse)’ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి ఉచితంగానూ, కొన్ని ప్రీమియం వెర్షన్లలోనూ లభిస్తాయి. ఆ తర్వాత, అదే సాఫ్ట్‌వేర్‌కు చెందిన డెస్క్‌టాప్ వెర్షన్‌ను మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్లో (విండోస్ లేదా మ్యాక్) ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్, ల్యాప్‌టాప్ రెండింటినీ ఒకే వై-ఫై (Wi-Fi) నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి, ఫోన్ లోని యాప్ ద్వారా కంప్యూటర్ను పేర్ (Pair) చేస్తే సరిపోతుంది. కనెక్షన్ పూర్తవ్వగానే మీ పాత ఫోన్ స్క్రీన్ ఒక అద్భుతమైన వైర్లెస్ మౌస్లా మారిపోతుంది. ఇలా డబ్బాలో పడేసే పాత ఫోన్‌కు మళ్లీ ప్రాణం పోసి, కొత్త మౌస్ కొనే ఖర్చును చాలా తేలికగా ఆదా చేసుకోవచ్చు.
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!