Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh: బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఏ సినిమా సంచలనంగా మారుతుందో చెప్పలేం. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, పెద్ద ప్రమోషన్స్ ఉన్న సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేక బోల్తా పడుతుంటే.. ఎలాంటి హైప్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమా మాత్రం ఊహించని స్థాయిలో వసూళ్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్లో ‘హనుమాన్ అంశ్’ సినిమా ఇలాంటి అరుదైన విజయాన్నే అందుకుంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం ఆగస్టు 6న థియేటర్లలోకి వచ్చింది. మొదట్లో ఈ సినిమాను కనీసం పట్టించుకునే పరిస్థితి లేకపోయినా, మూడో వారానికి వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద ఒక్కసారిగా పుంజుకుంది. చివరకు రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ‘హనుమాన్ అంశ్’ సినిమా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత నేపథ్యంలో రూపొందింది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్య నీమ్ కరోలి బాబా పాత్రలో నటించారు. అనిల్ రస్తోగి, చందన్ కె. ఆనంద్, పూర్ణిమా తివారి, విహాన్ షేజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. యాక్షన్, విజువల్స్ కంటే భక్తి, ఆధ్యాత్మికత, ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని ప్రధానంగా తీసుకుని ఈ కథను తెరకెక్కించారు.
కథ విషయానికి వస్తే లక్ష్మణ్ దాస్ అనే బాలుడు తల్లి మరణం తర్వాత ఆధ్యాత్మిక అన్వేషణలో ఇంటిని విడిచి వెళ్తాడు. ఆ తర్వాత హనుమంతుడిపై అతనికి ఏర్పడిన అచంచలమైన భక్తి, నిస్వార్థ సేవ, ఆధ్యాత్మిక ప్రయాణం అతన్ని కాలక్రమంలో నీమ్ కరోలి బాబాగా మార్చిన విధానాన్ని సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. ఆయన జీవితంలో చోటుచేసుకున్న పలు ఆధ్యాత్మిక సంఘటనలు, భక్తులతో ఆయనకు ఉన్న అనుబంధం కూడా కథలో కీలకంగా ఉంటాయి. అందుకే కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రానికి ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఏర్పడింది. అయితే ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ ప్రయాణం మొదటి నుంచీ ఇంత అద్భుతంగా లేదు. రిలీజ్ కు ముందు పెద్దగా ప్రమోషన్ లేకపోవడంతో సినిమాపై అంచనాలు ఎక్కడా కనిపించలేదు. అసలు సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా చాలా మందికి తెలీదు. థియేటర్లలోకి వచ్చిన తొలి రోజున ఈ చిత్రం కేవలం రూ.10 లక్షల వరకు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. మొదటి రెండు వారాల వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమా త్వరగానే థియేటర్ల నుంచి వెళ్లిపోతుందని చాలామంది భావించారు. రెండు వారాల ముగిసే సమయానికి మొత్తం వసూళ్లు సుమారు రూ.1.48 కోట్ల వద్దే ఉన్నాయి.
Also Read
- M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా 'MS సుబ్బులక్ష్మి' బయోపిక్ ప్రారంభం
- OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
- Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
- RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
అసలు కథ మాత్రం మూడో వారంలో మొదలైంది. అప్పటివరకు నెమ్మదిగా సాగిన సినిమా వసూళ్లు ఒక్కసారిగా పెరిగాయి. మూడో వారంలోనే సుమారు రూ.10.40 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్ పబ్లిసిటీతో మరిన్ని థియేటర్లు ఈ సినిమాను ప్రదర్శించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మూడో వారానికి వచ్చేసరికి స్క్రీన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మొదట్లో పరిమిత సంఖ్యలో ప్రదర్శితమైన సినిమా ఆ తర్వాత 400కు పైగా స్క్రీన్లలోకి వెళ్లడం ఈ విజయానికి మరో ప్రత్యేకతగా మారింది. నాలుగో వారంలోనూ ‘హనుమాన్ అంశ్’ దూకుడు తగ్గలేదు. శుక్రవారం సుమారు రూ.6.25 కోట్లు, శనివారం సుమారు రూ.9.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు బాక్సాఫీస్ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 23 రోజుల్లో భారతదేశంలో ఈ సినిమా మొత్తం వసూళ్లు సుమారు రూ.27.38 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. కేవలం రూ.2 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమా స్లీపర్ హిట్‌గా నిలిచింది.
ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో జానపద కథలు, పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘కాంతార’, ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి చిత్రాల చుట్టూ ఏర్పడిన ఆసక్తి కూడా ఈ ట్రెండ్‌ను సూచిస్తోంది. అయితే ‘హనుమాన్ అంశ్’ విషయంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది పెద్ద స్థాయి విజువల్ ట్రీట్ కంటే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని కథగా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం. తక్కువ బడ్జెట్లో ఇలాంటి కథను తీసుకుని కమర్షియల్ విజయాన్ని సాధించడం చిత్రబృందానికి మరింత ప్రత్యేకమైన విషయంగా మారింది. కేవల 2కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్లకు పైగా చేరుకోవడం చిన్న విషయం కాదు. భారీ సినిమాల మధ్య ఎలాంటి హైప్ లేకుండా విడుదలై, ప్రేక్షకుల స్పందనతో స్క్రీన్లను పెంచుకుని, చివరకు తన బడ్జెట్‌కు ఎన్నో రెట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు 2026లో ఆసక్తికరమైన స్లీపర్ హిట్లలో ఒకటిగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన జోష్‌ను కొనసాగిస్తే 50 కోట్ల మార్కును చాలా సులభంగా దాటుతుందని, పాజిటివ్ టాక్ ఇలాగే కొనసాగితే ₹100 కోట్ల క్లబ్ వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ అనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు.
- Tags
- cinema
- Hanuman Ansh
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!