Pakistan: పాకిస్తాన్‌లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా, ప్రభుత్వం తలాడించాల్సిందే. లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. పాకిస్తాన్ ఎన్నో సార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది. ఇప్పుడు, నాలుగో సారి ఆ దేశంలో ‘‘ఆసిమ్ మునీర్’’ రూపంలో తిరుగుబాటు జరుగున్నట్లు కనిపిస్తోంది.
Pakistan: పాకిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్‌గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
దాయాది దేశం పాకిస్థాన్‌లో మరో తిరుగుబాటు తప్పదని వార్తలు షికార్లు చేస్తున్నాయి. సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాకిస్థాన్ పదవ అధ్యక్షుడయ్యాడు. 1999లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2001-2008 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు.
Pakistan: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లా బడౌత్ తహసీల్‌లోని కొటానా గ్రామం దగ్గర గల పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పూర్వీకుల భూమి రెండు హెక్టార్లను 1. 38 కోట్ల రూపాయలకు వేలం వేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.
Musharraf wanted to see Rahul Gandhi as PM: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. గతంలో పర్వేజ్ ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ హస్తం పార్టీపై విరుచుకుపడుతోంది. ఆదివారం తన సంతాప సందేశంలో ముషారఫ్ ను ప్రశంసించాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా…
Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారప్(79) దీర్ఘకాలిక అనారోగ్యంతో దుబాయ్ లో ఆదివారం మరణించారు. కరుడుగట్టిన భారత వ్యతిరేకిగా ముద్రపడిని ముషారఫ్ అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ నియంతగా మారాడు. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని పాకిస్తాన్ ను సైన్యం కనుసన్నల్లో పాలించాడు. చివరకు స్వదేశంలో దేశద్రోహం నేరాలు ఎదుర్కోవడమే కాకుండా తనను వ్యతిరేకించి వారిని సైన్యం సహాయంతో అణిచివేశాడు. చివరకు తనకు మద్దతు ఇచ్చిన బెనజీర్ భుట్టో వంటి వారిని హతమార్చాడనే అభియోగాలు…
Pervez Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ వెల్లడించింది.
బెనజీర్ భుట్టో హత్య: 2007 ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న బెనజీర్ భుట్టో పై దాడి చేసి హతమార్చారు. రావల్పిండిలో ఈ ఘటన జరిగింది. రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన జెనజీర్ భుట్టో.. ఆ ఏడాది జరుగబోయే ఎన్నికల్లో గెలుస్తుందని పాక్ ప్రజలు భావించారు. ఈ ఘటనకు కొన్ని నెలల ముందు కరాచీలో జరిగిన ఆత్మాహుతి దాడి నుంచి తప్పించుకున్న భుట్టో చివరకు రావల్పిండి దాడిలో చనిపోయింది. ఈ దాడిలో 139 మంది మరణించారు.
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోలుకోవడం అసాధ్యంగా మారిందని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఆయనను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ముషారఫ్ ఫ్యామిలీ కోరుకుంటే స్వదేశానికి ఆయనను తరలించేందుకు వీలు కల్పిస్తామరి పాక్ సైన్యం పేర్కొన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.అలాగే ‘కుటుంబ సభ్యుల అంగీకారం, వైద్యుల సలహా మీదట…
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ రూలర్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. 78 ఏళ్ల వయసులో తీవ్ర ఆరోగ్య సమస్యలతో, ఆరోగ్యం క్షీణించడంతో దుబాయ్ లోని ఓ అమెరికన్ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ముషారఫ్ ను చూసేందుకు ఆయన బంధువులు పాక్ నుంచి దుబాయ్ వెళ్లారు. 1999 నుంచి…