Mohan Bhagwat: కుక్కల బెడదపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- కుక్కల బెడదపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- నాగపూర్‌లో జరిగిన సదస్సులో అభిప్రాయం వ్యక్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డాగ్ లవర్స్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇప్పటికీ అనుకూల-వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవులు, జంతువులు, ప్రకృతి సామరస్యంగా జీవించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమతుల్య సహజీవనాన్ని ఎలా నడిపించుకోవాలో సమాజం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Bangladesh Poll Results: తారిక్ రెహమాన్‌దే బంగ్లాదేశ్
Also Read
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్‌కు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
గురువారం నాగపూర్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కానైన్ ప్రాక్టీస్ మరియు మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ యూనివర్సిటీ (MAFSU) సంయుక్తంగా నిర్వహించిన ‘ఒక ఆరోగ్యంలో కుక్కల పాత్ర.. భాగస్వామ్యాన్ని నిర్మించడం-సవాళ్లను పరిష్కరించడం’’ అనే అంశంపై జరిగిన జాతీయ సింపోజియంలో మోహన్ భగవత్ ప్రసంగించారు.
‘‘ఇటీవల కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఢిల్లీలో పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ అంశంపై రెండు వెర్షన్స్ వినిపించాయి. ఒక వర్గం కుక్కలను చంపాలని.. ఇంకొక వర్గం అసలు ముట్టుకోకూడదు అని. దీని గురించి నన్ను అడిగినప్పుడు మధ్య మార్గం కూడా ఉండొచ్చని చెప్పాను. కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ వంటి చర్యలు ఉపయోగించవచ్చు. ప్రమాదాలను తగ్గించడానికి.. భ్రదత కోసం అనేక చర్యలు తీసుకోవచ్చు. నేను పశువైద్యుడిని కాబట్టి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.’’ అని అన్నారు.
‘‘గతంలో పశువైద్యులకు చాలా పరిమితి ఉందని నమ్మాం. కానీ అది నిజం కాదు. మనం చాలా విస్తృత స్థాయిలో ఆలోచించాలి. కచ్చితంగా ప్రత్యేక పశువైద్య మండలి ఉండాలి. అది అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. జంతువుల గురించి నిర్ణయాలు తీసుకోవాలంటే.. వాటి గురించి తెలిసిన పశువైద్యులను గానీ.. జంతు శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి. జంతువులు గురించి అవగాహన వారికి ఉంటుంది. అవసరమైన జ్ఞానం వారికే ఉంటుంది కాబట్టి వారికి బాధ్యతలు అప్పగించాలి. ఇప్పుడు క్రీడల విషయంలో ఏం జరుగుతుంది. క్రీడా రంగానికి చెందిన వ్యక్తులే నిర్ణయం తీసుకుంటారు. అలాగే జంతువుల విషయంలో పశువైద్యులకే అవగాహన ఉంటుంది. కాబట్టి పశువైద్యుల్ని సంప్రదించి ఆ రంగాన్ని ముందుకు నడిపిస్తే.. అప్పుడు పురోగతి లభిస్తుంది.’’ అని
మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
#WATCH | Nagpur | RSS Chief Mohan Bhagwat says, "Recently, a decision was taken regarding dogs, which caused a major uproar in Delhi. Two extreme viewpoints were being discussed, one saying that all dogs should be killed, and the other saying that dogs should not be touched at… pic.twitter.com/bx0I08vaYy
— ANI (@ANI) February 13, 2026
తాజావార్తలు
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్‌మ్యాన్‌కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్‌లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!