Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saira Banu First Look: హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త తెలుగు చిత్రం ‘సైరాబాను’ (Saira Banu) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు, ఆగస్టు 15, 2026 న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన ‘మసూద’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాంధవి శ్రీధర్ హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత రాజేష్ దండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఈ చిత్రం ద్వారా ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విభిన్న సంస్కృతుల నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ అండ్ వైబ్రెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర స్వరాలను అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
అయితే పోస్టర్‌లోని నేపథ్యం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఒకవైపు హిందూ దేవాలయం, మరోవైపు ఇస్లామిక్ శైలిలో నిర్మించిన కట్టడం రెండు విభిన్న ప్రపంచాలను ఒకే ఫ్రేమ్‌లో నిలబెట్టినట్లుగా అనిపిస్తోంది. మధ్యలో ఎగురుతున్న తెల్ల పావురాలు శాంతి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తూ పోస్టర్ లుక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరో ఆది సాయికుమార్ పక్కా తెలుగు సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్న కుటుంబానికి చెందిన యువకుడిగా నటిస్తున్నారు. అలాగే, హీరోయిన్ బాంధవి శ్రీధర్ ఆధునిక ఆలోచనలు ఉన్న ముస్లిం యువతి (సైరాబాను) పాత్రలో కనిపిస్తున్నారు. వేర్వేరు నేపథ్యాలు, ఆచారాలు ఉన్న ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, వారి ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేదే ఈ సినిమా కథాంశంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఫణి కృష్ణ సిరికి ఈ ప్రేమకథను ఎమోషనల్‌గానే కాకుండా, రెండు కుటుంబాల మధ్య జరిగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా కూడా తెరకెక్కిస్తున్నారు.
Also Read
- Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
- Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
- The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
- 2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
ఆది సాయి కుమార్ గత కొంతకాలంగా విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్లో కొత్త దారిని వెతుకుతున్నారు. ఇప్పుడు ‘సైరాబాను’లో ఆయన కనిపిస్తున్న కొత్త లుక్, పాత్రకు ఉన్న ప్రత్యేకత సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం రిలీజ్ డేట్ ను ప్రకటించకపోయినా, ఫస్ట్ లుక్కు వస్తున్న స్పందన చూస్తుంటే ‘సైరాబాను’ ఒక విభిన్న ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం తరువాత ‘శంబాల’ తో హిట్ అందుకున్న ఆదికి ‘సైరాబాను’ పోస్టర్ చూస్తుంటే మరో హిట్ పడేటట్లు కనిపిస్తోంది.
- Tags
- cinema
- Saira Banu
తాజావార్తలు
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!