Amit Shah: మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు, మావోయిస్టులపై ఎడతెగని పోరాటం సాగిస్తోందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో కూడా మావోయిస్టులపై ఆపరేషన్లు కొనసాగుతాయని, ప్రధాని నాయకత్వంలో అతి తక్కువ కాలంలోనే భారత్ నుంచి మావోయిస్టులను నిర్మూలిస్తామని నిశ్చయంగా చెబుతున్నానని అమిత్ షా అన్నారు.
Read Also: Pakistan: పాక్ కీలక నిర్ణయం.. ఎక్స్ ట్విట్టర్‌ను బ్లాక్ చేసిన ప్రభుత్వం
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
మూడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 80 మందికి పైగా మావోయిస్టులను నిర్మూలించామని, 2019 నుంచి ఇప్పటి వరకు 250 క్యాంపులు ఏర్పాటు చేశామని, భద్రతను పటిష్టపరిచామని చెప్పారు. మంగళవారం రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీనియర్ మావోయిస్టులతో పాటు 29 మంది హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్ చరిత్రలో ఒకే ఎన్‌కౌంటర్‌లో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టుల మరణించడం ఇదే తొలిసారి. 2024 నుంచి బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్లలో 79 మంది మావోలు మరణించారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!