Balabhadrapuram Cancer Cases: బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు కలకలం సృష్టించాయి.. వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి.. టెస్ట్‌లు సైతం చేస్తున్నారు.. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అత్యుత్సాహం బలభద్రపురం గ్రామానికి శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గ్రాసిమ్ నుండి ముడుపుల కోసమే అసెంబ్లీ వేదికగా క్యాన్సర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ముందే ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించి అప్పుడు అసెంబ్లీలో క్యాన్సర్ విషయం ప్రస్తావిస్తే బాగుండేదని అన్నారు. అలా కాకుండా బలభద్రపురంలో నేను 200 మంది పైగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను పరామర్శించానని చెప్పడంలో నిజం ఎంత ఉందో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికే తెలుసునని వ్యాఖ్యానించారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి..
Read Also: AA 22 : అల్లు అర్జున్..అట్లీ.. పాన్ వరల్డ్ సినిమా.!