Gadchiroli : మహారాష్ట్రలోని గడ్చిరోలి-నారాయణ్‌పూర్ సరిహద్దులోని కోపర్షి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. 19 C60 యూనిట్లు CRPF QAT 02 యూనిట్ల ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 8 గంటల పాలు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఒక పురుషుడు, ముగ్గురు స్త్రీలు ఉన్నట్టు తెలుస్తోంది. 4 ఆయుధాలతో పాటు – 01 SLR రైఫిల్, 02 INSAS రైఫిల్స్ , 01.303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు…
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహదుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నక్సలైట్లు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, మావోయిస్టు ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రన్న తలపై ఇప్పటికే రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంకా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి.
Big Breaking: ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్రంలోని నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని మాడ్ ఏరియాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపుగా 36 మంది మావోయిస్టులు హతమయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నక్సలైట్లు ప్రజాకోర్టును నిర్వహించి ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గ్రామస్తులకు మావోయిస్టులు మరణశిక్ష విధించారు. మూడో వ్యక్తిని విడుదల చేశారు. ఈ ఘటన బీజాపూర్‌లో చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా.. పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని పోలీసు అధికారి శనివారం తెలిపారు.