Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- మధ్యాహ్న భోజనంపై రాజకీయ రచ్చ
- గుడ్ల స్థానంలో రాజ్మా ఏర్పాటు
- బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజనంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంపై కొత్త రాజకీయ వివాదం చెలరేగింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టులో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నుంచి గుడ్లను తొలగించి.. వాటి స్థానంలో రాజ్మా వంటి శాఖాహార పదార్థాలను చేర్చాలని నిర్ణయించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈ పైలట్ ప్రాజెక్టు ప్రకారం.. కేఎంసీ పరిధిలోని పాఠశాలలకు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ISKCON) ఆధ్వర్యంలో వండిన మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయనున్నారు. ఈ కొత్త మెనూలో గుడ్లకు బదులుగా రాజ్మా వంటి శాఖాహార వంటకాలను అందించనున్నారు. రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం చేసే వ్యయాన్ని రూ.6.78 నుంచి రూ.10కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఈ నిర్ణయంపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాంసాహార ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే బెంగాల్ ప్రజలపై బీజేపీ శాఖాహార సంస్కృతిని రుద్దాలని ప్రయత్నిస్తోందని ఆరోపించింది. మహువా మొయిత్రా మాట్లాడుతూ.. గుడ్ల స్థానంలో రాజ్మా ఇవ్వడం పోషకాహార పరంగా సరైన నిర్ణయం కాదని అన్నారు. ‘‘గుడ్డు అత్యుత్తమమైన ‘క్లాస్-ఏ’ ప్రోటీన్. శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమినో ఆమ్లాలు అందులో ఉంటాయి. జంతువులకు చెందని ప్రోటీన్లలో సోయా మాత్రమే దానికి దగ్గరగా ఉంటుంది. కానీ మా పిల్లలు సోయా తినడానికి ఇష్టపడరు. పాఠశాలల్లో ఇస్తే కూడా తినరు. అలాంటప్పుడు గుడ్లను ఎందుకు తొలగిస్తున్నారు?.’’ అని ప్రశ్నించారు.
‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’
రాజ్మాను ప్రత్యామ్నాయంగా ఇవ్వడాన్ని కూడా ఆమె ఎద్దేవా చేశారు. ‘‘మీరు రాజ్మా చావల్ తింటారు కాబట్టి అందరూ తినాలా? అసలు బెంగాలీలకు రాజ్మా అంటే ఏమిటో తెలుసా? నేను ఢిల్లీకి వెళ్లిన తర్వాతే రాజ్మా గురించి తెలుసుకున్నాను. మా రాష్ట్రంలో దాదాపు 40 శాతం మంది పిల్లలు రోజుకు పోషకాహారం లభించే ఏకైక వేడి భోజనం కోసం పాఠశాలకు వస్తుంటారు.’’ అని మహువా మొయిత్రా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ప్రతిపక్ష నేత రితబ్రతా బెనర్జీ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. బెంగాల్లో తరతరాలుగా ప్రజలు జంతు ప్రోటీన్‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారని, దానిని మార్చే ప్రయత్నం సరైంది కాదని అన్నారు.
ఈ విమర్శలను బీజేపీ, ఇస్కాన్ ఖండించాయి. విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ మాట్లాడుతూ.. ‘‘పోషకాహారం అంటే కేవలం గుడ్లు మాత్రమే కాదు. పప్పులు, సోయా ఉత్పత్తులు, పాల పదార్థాలు, కూరగాయల ద్వారా కూడా పిల్లలకు అవసరమైన ప్రోటీన్లు, పోషకాలు అందించవచ్చు.’ అని వివరించారు. ప్రస్తుతం గుడ్ల స్థానంలో శాఖాహార మెనూను ప్రవేశపెట్టిన ఈ నిర్ణయం పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. విద్యార్థుల పోషకాహారం, స్థానిక ఆహారపు అలవాట్లు, ప్రభుత్వ విధానాలపై అధికార-ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు మరింత వేడెక్కుతున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!