శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సింధూరరెడ్డికి ఓ ఫోన్ వచ్చింది.. మాకు వడ్డించే అన్నం, కూర బాగాలేదని విద్యార్థులు నేరుగాఎమ్మెల్యే సింధూర రెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.. ఇక, ఫోన్ కాల్ తో స్పందించి ఎమ్మెల్యే సింధూరరెడ్డి.. పాముదుర్తి పాఠశాలలను విజిట్ చేశారు.. పాముదుర్తి ప్రాథమిక, హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.. నాణ్యతలేని ఫుడ్ సరఫరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు
Mid Day Meal In Colleges: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుండి మధ్యాహ్న భోజనం అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విజయవాడ పాయకాపురం నుండి మంత్రి లోకేశ్…