Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 7,994 మంది అభ్యర్థులు
- మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు..
- 7994 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు..
- అధికారంలోకి వచ్చేం దుకు యత్నిస్తున్న మహాయుతి- మహావికాస్ కూటములు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. వారిలో 921 మంది నామినేషన్ పేపర్లను అధికారులు తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ అక్టోబర్ 22వ తేదీన ప్రారంభమై 29తో ముగిసింది. అక్టోబర్ 30వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన కూడా పూర్తైంది. అభ్యర్థిత్వాల ఉప సంహరణకు నవంబర్ 4వ తేదీ లాస్ట్.
Read Also: Karthika Masam 2024: కార్తీక మాసం విశేషాలు.. మొదలయ్యేది ఎప్పటి నుంచి అంటే..
Also Read
కాగా, 288 మంది శాసన సభ్యులున్న మహారాష్ట్రలో నవంబరు 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న తుది ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ(అజిత్)లతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.
Read Also: Fire Accident : దీపావళి రోజు ఢిల్లీలో 318చోట్ల మంటలు.. అనేక ఇళ్లు బూడిద
అయితే, మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో తొలి ఓటర్లు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారు. మొత్తం ఓటర్లలో 5 కోట్ల మందికి పైగా పురుషులు ఉండగా.. 4.6 కోట్ల మంది ఉమెన్స్ ఉన్నారు. 18-19 ఏళ్ల వయసు గల తొలి ఓటర్లు 22.22 లక్షల మంది అని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇక, శతాధిక వృద్ధులు 21,089 మంది ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 72 లక్షలకు పెరిగిపోయింది అని ఈసీ తెలిపింది.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!