CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
- హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- క్యూర్ పరిధిలో ఎస్టీపీలు వంద శాతం పనిచేయాల్సిందే
- భవన నిర్మాణాలు, పార్కులకు శుద్ధి చేసిన నీరే వాడాలి
- నవంబర్ 1 నుంచి కొత్త ఆదేశాలు.. ఎస్టీపీలపై నిరంతర పర్యవేక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని నగరం హైదరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగు నీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. క్యూర్ ఏరియాలో మంచినీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ఏరియాలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. శుద్ది చేసిన నీటిని సెక్రటేరియట్ తో పాటు సీఎంవో, అవుటర్ రింగ్ , మైట్రో రైల్ , ఇతర శాఖల కార్యాలయాల్లో పచ్చదనం నిర్వహణ, ఇతర అవసరాలకు వినియోగించేలా చూడాలని సీఎం తెలిపారు. పబ్లిక్ పార్క్ లు, రోడ్ల శుభ్రత కు కూడా ట్రీటెడ్ వాటర్ నే వాడాలన్నారు. భవన నిర్మాణంలో శుద్ది చేసిన నీటినే వాడాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రెడ్కో ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఎస్టీపీల్లో నీటి శుద్దికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొదన్నారు. ప్రతి శుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ కేంద్రాల పనితీరును ఎప్పటికిప్పుడు హైడ్రా పర్యవేక్షించాలన్నారు. ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
Also Read
- Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
- Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
- Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
- Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాటర్ ను గ్రీన్ ట్యాంకర్స్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. వినియోగదారుల నుంచి కేవలం రవాణా రుసుం మాత్రమే వసూలు చేస్తున్నామని, నీళ్లను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!