PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
- నాలుగు రాష్ట్రాలు 28 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు..
- ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదని కాంగ్రెస్..
- కాంగ్రెస్ పరిస్థితిపై ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలువలేకపోయింది. బీహార్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చివరకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ-జేడీయూ కూటమి కైవసం చేసుకుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌కు ఒక్క స్థానం దక్కలేదు.
దీనిపై ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఫలితాలను ప్రస్తావిస్తూ, “కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందో ఊహించండి?” అనే ప్రశ్నతో పాటు ఎమోజీని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన విషయాన్ని ప్రధాని ఎత్తిచూపారు.
Also Read
- Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
- Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
- Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
- Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
నాలుగు రాష్ట్రాల్లోని 28 స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. గతంలో ఆ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉండేవి. ఓడిపోయిన సందర్భంలో కాంగ్రెస్ ఈవీఎంలపై నిందలు వేసేది. ఈ నేపథ్యంలోనే మోడీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, అయినా కూడా కాంగ్రెస్ గెలవలేదని తన పోస్ట్ ద్వారా చెప్పారు. ఈ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో 11, బీహార్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 4 శాసన మండలి స్థానాలకు పోటీ జరిగింది.
MLC elections in 28 seats across 4 big states – Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka.
Elections held using ballot papers.
Guess how many seats Congress won? 🧐
— Narendra Modi (@narendramodi) October 28, 2026
తాజావార్తలు
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
-
Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!