Karthika Masam 2024: హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి, శ్రద్ధలతో శివ కేశవులిద్దరనీ ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా శ్రావణ మాసంలో లాగానే.. కార్తీక మాసంలోనూ ఎలాంటి మాంసాహారాలు ముట్టుకోకుండా నియన నిష్టలు పాటిస్తూ.. దీపాలు వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం.. అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం చాలా పవిత్రమైనదని స్కాంద పురాణంలో పేర్కొన్నారు. ఇది అత్యంత మహిమాన్వితమైన మాసం. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో మాసమంతా భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. బ్రహ్మముహూర్తంలో కార్తీక స్నానం.. కార్తీక దీపం వెలిగిస్తారు. అయితే.. ఈ ఏడాది (2024) నవంబర్ 2న ప్రారంభం కానుంది. నవంబర్ 1న పాడ్యమి ఘడియలు వచ్చినప్పటికీ సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున నవంబర్ 2 నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి సహా కార్తీక మాసంలోని ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం.
కార్తీక మాసం ముఖ్యమైన రోజులు..
* కార్తీక మాసం నవంబర్ 02 నుండి ప్రారంభమవుతుంది.
* నవంబర్ 03 …. ఆదివారం …యమవిదియ – భగినీహస్త భోజనం
* నవంబర్ 04 … మొదటి కార్తీక సోమవారం
* నవంబర్ 05….మంగళవారం…. నాగుల చవితి
* నవంబర్ 06…. బుధవారం…. నాగపంచమి
* నవంబర్ 11… రెండవ కార్తీక సోమవారం
* నవంబర్ 12….మంగళవారం….ఏకాదశి…దీన్నే మాతత్రయ ఏకాదశి అంటారు
* నవంబర్ 13 ….బుధవారం…… క్షీరాబ్ది ద్వాదశి దీపం
* నవంబర్ 15 …..శుక్రవారం …కార్తీకపూర్ణిమ, జ్వాలాతోరణం (365 వత్తులతో దీపాలు వెలిగిస్తారు)
* నవంబర్ 18 ….కార్తీకమాసం……మూడో సోమవారం
* నవంబర్ 19 …..మంగళవారం ….సంకటహర చతుర్థి (గణేశుడికి గరిక సమర్పిస్తారు)
* నవంబర్ 25 ……కార్తీకమాసం…. నాల్గవ సోమవారం
* నవంబర్ 26 ….. మంగళవారం ….. కార్తీక బహుళ ఏకాదశి
* నవంబర్ 29 …. కార్తీక మాసంలో శివరాత్రి
* డిసెంబర్ 1… ఆదివారం… కార్తీక అమావాస్య
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు