Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టి సౌత్‌లోనే టాప్ హీరోయిన్గా నిలబడింది కీర్తి సురేష్. సావిత్రి గారి పాత్రలో ఆమె చూపించిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ, తెరపై అంత పెద్ద హిట్ చూసిన తర్వాత కూడా.. ఆమె నిజ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారంటే ఎవరూ నమ్మలేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి, ‘మహానటి’ తర్వాత తాను ఫేస్ చేసిన పరిస్థితుల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ‘మహానటి’ హిట్ కొట్టగానే కీర్తి చకచకా సినిమాలు చేసుకుంటూ పోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఏకంగా ఆరు నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి బ్రేక్ తీసుకున్నారు.
ఆ విరామం గురించి చెబుతూ.. “మహానటి తర్వాత నేను తీసుకున్న ఆరు నెలల బ్రేక్ వల్ల నా ఫైనాన్షియల్ పొజిషన్ పూర్తిగా తలకిందులైంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను” అంటూ నిజం బయటపెట్టారు. అయితే ఆ గ్యాప్ తీసుకున్నందుకు తాను ఏమాత్రం బాధపడట్లేదని కీర్తి చెప్పారు. ఆ బ్రేక్ తన లైఫ్‌లో ఎంతో మార్పు తీసుకొచ్చిందని అన్నారు. “ఆ టైమ్‌లోనే నా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ పెట్టాను. అప్పటివరకు నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దాంతో రెగ్యులర్‌గా వర్కవుట్లు చేస్తూ నన్ను నేను హెల్దీగా మార్చుకున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా, డబ్బుని ఎలా దాచుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత ముఖ్యం అనేది ఆ ఆరు నెలల గ్యాప్‌లోనే బాగా అర్థమైంది” అని కీర్తి చెప్పుకొచ్చారు. అంత పెద్ద హిట్ తర్వాత కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయని ధైర్యంగా ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమే. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!