Udhayanidhi Stalin: చివరి చిత్రమన్నాడు.. నిర్మాత నోటీసులు పంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court Issued Notice To Udhayanidhi Stalin Over Angel Movie Issue: తాను చేసిన మామన్నన్ సినిమానే చివరిదని నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు.. అతడ్ని ఇరకాటంలో పడేశాయి. ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ నిర్మాత వెనకుండి ఈ పని చేశాడు. అంతేకాదు.. ఈనెల 29న విడుదలకి సిద్ధంగా ఉన్న ‘మానన్నన్’ రిలీజ్‌ని ఆపేయాలని ఆ నిర్మాత కోరాడు. అసలెందుకు ఆ నిర్మాత ఈ పని చేశాడు? పదండి.. ఆ వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
Manipur: మంత్రి గోడౌన్‌కు నిప్పుపెట్టిన దుండగులు.. ఇంటిని తగలబెట్టేందుకు యత్నం
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
మానన్నన్ సినిమా ప్రారంభించడానికి ముందే.. నిర్మాత రామశరవణన్ నిర్మాణంలో స్టాలిన్ ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సినిమాకి ‘ఏంజెల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, ఆనంది కథానాయికలు. కేఎస్.అదయమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. మరో 20 శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. ఈ సినిమా కోసం నిర్మాత రూ.13 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆలస్యం అయ్యింది. ఈ గ్యాప్‌లో ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ సినిమాని ప్రారంభించి, ఇప్పుడు రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. అంతేకాకుండా.. ఇదే తన చివరి చిత్రమని ప్రకటించాడు.
Bangalore Pre School: దారుణం.. క్లాస్ రూంలో చిన్నారిపై దాడి చేసిన బాలుడు
ఈ నేపథ్యంలోనే.. నిర్మాణ రామశరవణన్ కోర్టు మెట్లు ఎక్కారు. ‘మామన్నన్’ సినిమానే తన చివరి చిత్రమని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారని, మరి తన సినిమా సంగతేంటని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్టాలిన్ తన సినిమా పూర్తి చేయకపోతే, తాను చాలా నష్టపోతానని అన్నారు. కాబట్టి.. మామన్నన్ విడుదలపై నిషేధం విధించి, తన సినిమాని పూర్తి చేయాలంటూ స్టాలిన్‌ని ఆదేశించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ పిటిషన్‌ని విచారించిన మద్రాసు హైకోర్టు.. స్టాలిన్‌కు, ‘మామన్నన్’ నిర్మించిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆలోపు నోటీసులకు స్పందించాల్సిందిగా కోర్టు వారిని ఆదేశించింది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!