Shehla Rashid: ఒకప్పుడు మోడీ విమర్శకురాలు..ఇప్పుడు ‘‘భారతీయులుగా పుట్టడం అదృష్టం’’ అంటూ ప్రధానిపై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shehla Rashid: జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకురాలు, ఒకప్పుడు నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించే విమర్శకురాల, ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది. షెహ్లా రషీద్, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భారతీయులుగా పుట్టినందుక చాలా అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక శాంతి, భద్రతకు భరోసా ఇచ్చినందుకు ప్రధాని మోడీ, భారత సైన్యానికి, కేంద్రమంత్రి అమిత్ షాలను ఆమె ప్రశంసించారు.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం వేళ, గాజా ప్రాంతంలో మానవతా సంక్షోభం ఏర్పడింంది. ఉత్తర గాజాను 24 గంటల్లో విడిచిపోవాలని ఇజ్రాయిల్ హెచ్చరించిన నేపథ్యంలో దక్షిణం వైపు లక్షలాది మంది తరలివెళ్తున్నారు. ఈ పరిస్థితి తీవ్ర మానవ సంక్షోభానానికి కారణమైంది.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
Read Also: Putin: ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..
‘‘మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే భారతీయులుగా మనం ఎంత అదృష్టవంతులమో ఈ రోజు నేను గ్రహించాను. భారత సైన్యం, భద్రతా దళాలు మన భద్రత కోసం తమ సర్వస్వం త్యాగం చేశారు. ప్రధాని మోడీ, భారతసైన్యం, హోంమంత్రి అమిత్ షాలకు థాంక్స్, కాశ్మీర్‌కి శాంతి చేకూరుతుంది’’ అంటూ షెహ్లా రషీద్ ట్వీట్ చేశారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో చూసినట్లుగా భద్రత లేకుండా శాంతి అసాధ్యం, కాశ్మీర్ లో దీర్ఘకాలిక శాంతి, భద్రతలకు కోసం భారత్ సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ధైర్యసాహసాలు, ఎన్నో త్యాగాలు చేశారని ఆమె పోస్టులో వెల్లడించారు.
ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ పాటు మరికొందరు తుక్డే-తుక్డే గ్యాంగ్ గా ముద్రపడ్డారు. ఫ్రీకాశ్మీర్ అంటూ ఢిల్లీలోని జేఎన్ యూనివర్సిటీలో నినదించారు. ఆ సమయంలో 2016లో షెహ్లా రషీద్ తొలిసారిగా వార్తల్లో నిలిచారు. కాశ్మీర్ లో సాయుధబలగాలు ఇళ్లను దోచుకుని భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తూ 2019లో ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై కేసు నమోదైంది.
ఈ ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తల నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు షెహ్లా రషీద్. కాశ్మీర్ లో మానవహక్కులు మెరుగుపడ్డాయని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలను రక్షిస్తోందని గతంలో షెహ్లా రషీద్ అన్నారు.
https://twitter.com/Shehla_Rashid/status/1713085727892983875
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!