Shehla Rashid: ఒకప్పుడు ప్రధాని నరేంద్రమోడీని విపరీతంగా వ్యతిరేకించే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ ప్రస్తుతం పొగడ్తల వర్షం కురిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి ప్రధాని మోడీకి, హోమంత్రి అమిత్ షాలకు థాంక్స్ చెప్పారు. గతంలో తాను కాశ్మీర్ లో రాళ్లు విసిరే వారిపై సానుభూతితో వ్యవహరించానని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని షెహ్లా రషీద్ అన్నారు.
Shehla Rashid: జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకురాలు, ఒకప్పుడు నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించే విమర్శకురాల, ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది. షెహ్లా రషీద్, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భారతీయులుగా పుట్టినందుక చాలా అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక శాంతి, భద్రతకు భరోసా ఇచ్చినందుకు ప్రధాని మోడీ, భారత సైన్యానికి, కేంద్రమంత్రి అమిత్ షాలను ఆమె ప్రశంసించారు.