Parliament Sessions: ఇవాళ విపక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, సభను వాయిదా వేసే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. మరో వైపు ఈరోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర.. ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ను అవమానించిన కేంద్రమంత్రి రాజీనామా చేయాలని విజయ్ చౌక్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో ఇండియా కూటమి సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదలను సభ్యులు కాపాడాలన్నారు.. సభలో ధర్నాలు, ప్రదర్శనలు చేయడం సరికాదని స్పీకర్ ఓం బిర్లా సూచించారు.
Read Also: Shankar : ఇండియన్ -3 రిలీజ్ పై శంకర్ కీలక కామెంట్స్
కాగా, జమిలి ఎన్నికల ముసాయిదాను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఆ బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును పంపిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక, మరో వైపు విపక్ష ఎంపీల ఆందోళనతో రాజ్యసభను సైతం ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ వాయిదా వేశారు.