Airtel One Year Plan: జూలై 2024లో టెలికాం ఆపరేటర్లు వారి రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి వినియోగదారుల మొబైల్ ఖర్చులు బాగా పెరిగాయి. ముఖ్యంగా 28 రోజుల కనీస ప్లాన్ రూ.200 వరకు తీసుకెళ్లాయి టెలికాం కంపెనీలు. ఇకపోతే, మీరు ఎయిర్‌టెల్ వినియోగదారు అయితే తక్కువ ధరలో మీ సిమ్ కార్డ్‌ని యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేక ప్లాన్ వస్తుంది. కంపెనీ ఇలాంటి కొన్ని ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో మీరు తక్కువ ధరకు ఎక్కువ చెల్లుబాటు (వ్యాలిడిటీ)ను పొందుతారు.
Also Read: One Nation One Election: ‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు’’కు కేంద్ర కేబినెట్ ఆమోదం…
ఇందులో భాగంగానే.. ప్లాన్ రూ. 1999లో మీకు ఒక సంవత్సరం అంటే 365 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. దీనిలో మీరు డేటా, కాలింగ్ ఇంకా ఇతర ప్రయోజనాలను పొందుతారు. కాలింగ్‌పై దృష్టి సారించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక. అయితే ఇందులో మీరు నామమాత్రపు డేటాను పొందుతారు. ఎయిర్‌టెల్ రూ. 1999 ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 24GB డేటా ఇంకా రోజువారీ 100 SMS ల ప్రయోజనాన్ని పొందుతారు.
Also Read: Tollywood Rewind 2024 : టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు ఎవరెవరంటే?
అదనపు ప్రయోజనాల గురించి మాట్లాడితే, స్పామ్ రక్షణ ఇందులో అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఎయిర్‌టెల్ Xstream యాప్‌కు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు ఎయిర్‌టెల్ Xstreamకి ప్రీమియం యాక్సెస్ పొందలేరు. మీరు ఈ ప్లాట్‌ఫారమ్‌లో అన్ని ఉచిత కంటెంట్‌ను మాత్రమే పొందుతారు. అలాగే, మీరు అపోలో 24*7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌లో ఉచిత హలో ట్యూన్ ను పొందుతారు.