Youtube Auto Dubbing Feature: టెక్ దిగ్గజం కంపెనీ గూగుల్ తన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌ను చేర్చింది. ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలను చూసే సమయంలో వాటిని అర్థం చేసుకోవడం సులభం చేస్తుంది. ఈ ఫీచర్ పేరు ‘ఆటో డబ్బింగ్’. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పనిచేస్తుంది. యూట్యూబ్ కొత్త ఫీచర్ సహాయంతో, ఇప్పుడు ప్రపంచంలోని అనేక భాషల్లో వీడియోలను సులభంగా వీక్షించవచ్చు. ఈ కొత్త అద్భుతమైన ఫీచర్ సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.
Also Read: Winter: చలికాలంలో స్లైకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలో..!
ఈ ఫీచర్ సహాయంతో, యూట్యూబ్ స్వతహాగా వీడియోను ఒక భాష నుండి మరొక భాషలోకి అనువదిస్తుంది. అంటే డబ్ చేస్తుంది. అంటే మీరు ఒక వీడియోను ఇంగ్లీషులో అప్‌లోడ్ చేసినట్లయితే.. అది ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియా, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్ ఇంకా స్పానిష్ భాషల్లోకి డబ్ చేయబడుతుంది. అంతేకాకుండా మీరు ఈ భాషలలో ఏదైనా వీడియోను అప్‌లోడ్ చేసినట్లయితే, అది ఇంగ్లీషులోకి డబ్ చేయబడుతుంది. యూట్యూబ్ వీడియోలను ఒక భాష నుండి మరొక భాషలోకి మార్చడం ఫీచర్ AI సాంకేతికత సహాయంతో పని చేస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు, ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్స్ కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఈ ఫీచర్ ఇప్పటికీ కొత్తది కాబట్టి కొన్నిసార్లు అనువాదంలో కొన్ని తప్పులు ఉండవచ్చు. కానీ, ఈ ఫీచర్ కాలక్రమేణా మెరుగుపడుతుంది. ఈ ఫీచర్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. అయితే, కంపెనీ దీన్ని ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని ఎంచుకున్న ఛానెల్‌లకు అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ మీ ఛానెల్‌కు అందుబాటులో ఉంటే, మీరు దీన్ని “అధునాతన సెట్టింగ్‌లలో” చూడవచ్చు. మీరు డబ్బింగ్ వీడియోను పోస్ట్ చేసే ముందు సమీక్షించవచ్చు.
Also Read: Syed Mushtaq Ali Trophy: విదర్భ బౌలర్లను ఊచకోత కోసిన అజింక్య రహానే.. సెమిస్‌లోకి దూసుకెళ్లిన ముంబై