Kolkata Doctor Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార, హత్య కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు.. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ట్రై చేశారని.. హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని పేర్కొన్నారు. తమకు లంచం కూడా ఇచ్చేందుకు ట్రై చేశారని తెలిపారు.
Read Also: Kangana Ranaut: మేకప్ లేకపోతే.. అసలు కంగనా రనౌత్ను ఎవరు గుర్తుపట్టరు: హిమాచల్ప్రదేశ్ మంత్రి
ఇక, డాక్టర్ పై హత్యాచార ఘటనకు సంఘీభావంగా బుధవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన నిరసనల్లో బాధితురాలి తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు వాస్తవాలు తెలియకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు ఫస్ట్ నుంచి ట్రై చేశారు.. మృతదేహాన్ని చూసేందుకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు.. పోస్ట్‌మార్టం పూర్తయ్యేంత వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.. ఆ తర్వాత డెడ్ బాడీని మాకు అప్పగించే సమయంలో.. ఓ సీనియర్ పోలీసు అధికారి మా దగ్గరకు వచ్చి డబ్బులు ఆఫర్ చేయగా.. తాము దాన్ని తిరస్కరించామని ఆయన వెల్లడించారు.
Read Also: Delhi : లోపల వైఫై, జీపీఎస్, సీసీటీవీ..ఢిల్లీలోని సామాన్య ప్రజల కోసం స్పెషల్ బస్సు సర్వీసు
కాగా, ఈ కేసుపై తొలుత కోల్‌కతా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, దర్యాప్తు టైంలో వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పజేప్పింది. ప్రస్తుతం దీనిపై సీబీఐ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ సహా ఘటన చోటు చేసుకున్న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరి కొందరికి పాలీగ్రాఫ్ టెస్టులు చేసి అరెస్ట్ చేసింది.