కర్ణాటక రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న అవినీతి కేసులో విచారణను రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.