Karnataka: హెల్మెట్ లేదని లాయర్‌పై పోలీసుల దాడి.. ఆరుగురు సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఓ లాయర్‌పై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదం అయింది. ఇది పొలిటికల్ దుమారానికి తెరలేపింది.చిక్కమగళూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ లాయర్‌పై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రీతమ్ అనే న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా అతని బైక్ తాళాలను ట్రాఫిక్ పోలీసులు లాక్కున్నారు. ఈ ఘటన నవంబర్ 30న చోటు చేసుకుంది.
ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దాడికి పాల్పడిన ఆరుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించేందుకు లాయర్ ప్రీతమ్ సిద్ధంగా ఉన్నప్పటికీ… పోలీసులు అతడిని స్టేషన్‌కి తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారు. బాధిత వ్యక్తి ఛాతి, వీపు, చేతిపై రక్తపు మరకలు ఉన్నాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
Read Also: Russia-Ukraine War: ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..
పోలీసుల దాడిపై చిక్కమగళూర్ న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డెక్కారు. న్యాయవాదిని దుర్భాషలాడిన పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీస్ అధికారుల సస్పెన్షన్‌కి వ్యతిరేకంగా వారి కుటుంబ సభ్యులు సిటి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ కేసులో దాడికి పాల్పడిన పోలీసులపై సెక్షన్ 307 హత్యాయత్నం, అవమానించడం, తప్పుడు నిర్భంధానికి చెందిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ప్రీతమ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని అతను వెల్లడించారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని అమాయకపు ప్రజలు, రైతులు, దేశభక్తి ఉన్న కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, చిక్కమగళూర్‌లో యంగ్ లాయర్ ప్రీతమ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..