UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
- ఉత్తరప్రదేశ్‌లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
- ఇప్పటివరకు వెలువడిన 8 ఫలితాల్లో బీజేపీ 5, ఎస్పీ 3 స్థానాల్లో విజయం
- వారణాసి టీచర్స్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP MLC Election Results: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న 11 శాసనమండలి (MLC) స్థానాల ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (SP)ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన 8 స్థానాల ఫలితాల్లో బీజేపీ 5 చోట్ల విజయం సాధించగా.. సమాజ్‌వాదీ పార్టీ 3 కీలక స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన 3 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతుండగా.. అందులో ఎస్పీ 2 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారణాసి ఉపాధ్యాయ (టీచర్స్) నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎస్పీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి ప్రమోద్ మిశ్రాపై దాదాపు 4,900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాకుండా.. వారణాసి గ్రాడ్యుయేట్ స్థానంలోనూ ఎస్పీ ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు, ఆగ్రా ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి డాక్టర్ ఆకాశ్ అగర్వాల్.. బీజేపీ అభ్యర్థి హరి కిషోర్ తివారీపై గెలుపొందారు. ఝాన్సీ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కూడా ఎస్పీ దక్కించుకుంది. ప్రస్తుతం లక్నో గ్రాడ్యుయేట్ స్థానంలో సైతం ఎస్పీ ఆధిక్యంలో ఉంది.
Also Read
- Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
- Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
- SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
- Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
బీజేపీ ఇప్పటివరకు మీరట్ గ్రాడ్యుయేట్, మీరట్ టీచర్స్, లక్నో టీచర్స్, బరేలీ-మొరాదాబాద్ టీచర్స్ మరియు ఆగ్రా గ్రాడ్యుయేట్ స్థానాలను కైవసం చేసుకుంది. మీరట్‌లో రెండు స్థానాలనూ (టీచర్స్, గ్రాడ్యుయేట్స్) బీజేపీయే గెలుచుకుంది. అక్కడ దినేష్ కుమార్ గోయల్ (గ్రాడ్యుయేట్), శ్రీచంద్ శర్మ (టీచర్స్) విజేతలుగా నిలిచారు. బరేలీ-మొరాదాబాద్ టీచర్స్ స్థానంలో బీజేపీ అభ్యర్థి హరి సింగ్ ధిల్లాన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ఎస్పీ అభ్యర్థి దానిష్ అక్తర్‌పై 17,676 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం ఐదు రౌండ్ల లెక్కింపు ముగిసే సమయానికి ధిల్లాన్‌కు 21,672 ఓట్లు రాగా, అక్తర్‌కు 3,996 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజికవర్గం గోరఖ్‌పూర్ ఉపాధ్యాయ కోటా స్థానంలో తొలుత వెనుకంజలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.
ఆగ్రాలో ఎస్పీ అభ్యర్థి డాక్టర్ ఆకాశ్ అగర్వాల్ గెలుపొందిన తర్వాత ఆయనపై దాడి జరిగిందన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆకాశ్ అగర్వాల్ చిరిగిన కుర్తాతో ఉన్న వీడియోను ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. గెలుపొందిన తమ అభ్యర్థికి అధికారులు తక్షణమే ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఆగ్రాలో విజయం సాధిస్తున్న తమ ఎమ్మెల్సీ అభ్యర్థిపై బీజేపీ శ్రేణులు చేసిన ఈ దాడికి బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తాజావార్తలు
-
UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
ట్రెండింగ్
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!