Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఓ లాయర్‌పై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదం అయింది. ఇది పొలిటికల్ దుమారానికి తెరలేపింది.చిక్కమగళూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ లాయర్‌పై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రీతమ్ అనే న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా అతని బైక్ తాళాలను ట్రాఫిక్ పోలీసులు లాక్కున్నారు. ఈ ఘటన నవంబర్ 30న చోటు చేసుకుంది.