Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
- కర్ణాటకలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
- నాలుగు స్థానాలనూ బీజేపీ-జేడీఎస్ కూటమి కైవసం
- బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించగా, జేడీఎస్ ఒక స్థానంలో విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka MLC Election Results: కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి శాసనమండలి (MLC) ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా కింద ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ప్రతిపక్ష బీజేపీ–జేడీఎస్ (BJP-JD(S)) కూటమి ఈ నాలుగు స్థానాలనూ కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఇందులో మూడు స్థానాలను బీజేపీ తన ఖాతాలో నిలబెట్టుకోగా, సిట్టింగ్ కాంగ్రెస్ స్థానాన్ని జేడీఎస్ చేజిక్కించుకుంది. అక్టోబర్ 23న బ్యాలెట్ పేపర్ల ద్వారా ఈ నాలుగు స్థానాలకు పోలింగ్ జరిగింది.
బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన జేడీఎస్ అభ్యర్థి ఎ.పి. రంగనాథ్.. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుట్టణ్ణపై 908 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో రంగనాథ్‌కు 10,810 ఓట్లు రాగా.. పుట్టణ్ణ 9,902 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ చేతిలో ఉన్న కీలకమైన స్థానాన్ని జేడీఎస్ కైవసం చేసుకుంది. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వంత ఇలాకా కలబురగి, పరిసర కల్యాణ కర్ణాటక జిల్లాల పరిధిలోని ఈశాన్య ఉపాధ్యాయ (North-East Teachers’) నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ శశిల్ జి. నమోషి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శరణప్ప మట్టూర్పై ఆయన 3,297 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నమోషికి 15,596 ఓట్లు రాగా, మట్టూర్కు 12,299 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గం నుంచి నమోషి గెలవడం ఇది వరుసగా ఐదోసారి.
Also Read
ఆగ్నేయ పట్టభద్రుల (South-East Graduates) నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కె.ఎం. సురేష్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శశి హులికుంటె మఠ్పై ఆయన ఏకంగా 23,098 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు పశ్చిమ పట్టభద్రుల (West Graduates) స్థానంలోనూ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దీంతో నాలుగు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకుండా బీజేపీ-జేడీఎస్ కూటమి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
DK, it’s done, bro! 😂
NDA SWEEPS 4/4 Teachers’ and Graduates’ constituencies in the MLC elections! ✌️🪷 https://t.co/RD8lDwpE3e
— BJP Karnataka (@BJP4Karnataka) October 28, 2026
తాజావార్తలు
-
Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
-
UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ట్రెండింగ్
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!