Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India T20I World Records: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ ((113), వైభవ్ సూర్యవంశీ (45)లు విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ.. పరుగుల వరద పారించింది. వీరిద్దరి దూకుడుతో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లతో న్యూజిలాండ్ బౌలర్లు బిత్తరపోయారు. అభిషేక్-వైభవ్ విధ్వంసంతో భారత్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టగా.. మరో రికార్డును సమం చేసింది.
2.2 ఓవర్లలోనే భారత్ అర్ధ సెంచరీ:
భారీ లక్ష్య ఛేదనను ప్రారంభించిన అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. బౌలర్ ఎవరన్నది పట్టించుకోకుండా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అభిషేక్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో భారత్ కేవలం 2.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును అందుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన టీమ్ రికార్డును భారత్ సమం చేసింది. గతంలో పపువా న్యూ గినియా, రొమేనియా జట్లు కూడా 2.2 ఓవర్లలో 50 పరుగులు చేశాయి. అయితే టెస్టు హోదా కలిగిన దేశాల మధ్య ఇదే అత్యంత వేగవంతమైన టీమ్ హాఫ్ సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల పేరిట ఉండేది.
Also Read
- SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
- MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలావుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
- IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
- MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
ఐదు ఓవర్లలోనే 100 పరుగులు:
అభిషేక్, వైభవ్ విధ్వంసం అక్కడితో ఆగలేదు. భారత జట్టు కేవలం ఐదు ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అందుకుంది. దాంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా ఓ జట్టు 100 పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును టీమిండియా తన పేరిట లిఖించుకుంది. గతంలో ఈ రికార్డు రొమేనియా జట్టు పేరిట ఉండేది. 2021లో సెర్బియాపై 5.2 ఓవర్లలో 100 పరుగులు చేసింది. టెస్టు హోదా కలిగిన దేశాల మధ్య అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన రికార్డు గతంలో దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. ఇప్పుడు భారత్ ఆ రికార్డులన్నింటినీ అధిగమించి చరిత్ర సృష్టించింది.
పవర్‌ప్లేలో 118 పరుగులు:
భారత బ్యాటర్లు పవర్‌ప్లేలోనూ ప్రపంచ రికార్డు నమోదు చేశారు. తొలి ఆరు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఏకంగా 118 పరుగులు బాదారు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పవర్‌ప్లేలో నమోదైన అత్యధిక స్కోరుగా ఇది నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు రొమేనియా జట్టు పేరిట ఉండేది. 2021లో సెర్బియాపై రొమేనియా తొలి ఆరు ఓవర్లలో 116 పరుగులు చేసింది. ఇప్పుడు అభిషేక్, వైభవ్ దూకుడుతో భారత్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
35 బంతుల్లో అభిషేక్ శతకం:
అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 45 పరుగులు బాదాడు. అభిషేక్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పెవిలియన్‌కు చేరగా.. వైభవ్ తన హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు సృష్టించిన విధ్వంసం టీ20 క్రికెట్లో కొత్త చరిత్రకు నాంది పలికింది. అర్ధ సెంచరీని అత్యంత వేగంగా సాధించిన ప్రపంచ రికార్డును సమం చేయడంతో పాటు జట్టు 100 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేయడం, పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేయడం ద్వారా భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ రికార్డులు మరో జట్టుకు దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు.
తాజావార్తలు
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలావుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
ట్రెండింగ్
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!