ATM Cash Van Robbery Case: ఈ నెల 19న బెంగళూరు..సిలికాన్ సిటీలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినీ ఫక్కీలో దోచుకోవడం కలకలం రేపింది. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో అనుసరించింది దోపిడీ దొంగల ముఠా. కొంతదూరం వెళ్లిన తర్వాత క్యాష్ వెహికల్‌ను అడ్డగించి.. తాము సీబీఐ అధికారులమని చెప్పారు. వాహనాన్ని తనిఖీ చేయాలంటూ…. వ్యాన్‌లోని గన్‌మెన్, ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు. తనిఖీ నిమిత్తం…
Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ క్యాంపస్‌లో సీనియర్ విద్యార్థినిపై, మరో స్టూడెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని జీవన్ గౌడగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడితో ఆమెకు మూడు నెలల పరిచయం ఉంది. కాలేజీలో ఇద్దరూ కూడా ఒకే డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు.
Dharmasthala Case: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ‘ధర్మస్థల’ ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది.
Karnataka: కర్ణాటక హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు. నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన రితేష్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
DNA Test to Cow: కర్ణాటకలోని దేవనగరి జిల్లాలో గేదె యాజమాన్యాన్ని తేల్చడానికి డీఎన్‌ఏ పరీక్ష వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే, గేదె ఓ దేవాలయానికి చెందినది. వందలాది మంది ప్రజలు గేదెను పూజిస్తారు. అయితే, ఈ గేదె యజమాని ఎవరనే విషయంపై కునిబేలకర్ గ్రామం, కులగట్టే గ్రామం మధ్య తీవ్ర వివాదం నెలకొంది. కునిబేలకర్ గ్రామంలోని కరియమ్మ దేవి వద్ద ఈ గేదె ఎనిమిదేళ్లుగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు కులగట్టే గ్రామ ప్రజలు,…
Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపులు, గృహ హింస చట్టాలు సెక్షన్ 498-ఏ ని సమీక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భర్త, అతడి ఫ్యామిలీని వేధించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెబుతున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని,
Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపుల భరించేలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ వరకట్న వేధింపుల కారణంగా తాను చనిపోతున్నట్లు సుభాష్ 24 పేజీల లేఖ, గంటలకు పైగా వీడియోను రికార్డ్ చేసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరకట్న, గృహహింస సెక్షన్ 498ఏని సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మీ (29) అనే మహిళ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర సంచలనంగా మారింది. మహాలక్ష్మీని ముక్కలు.. ముక్కలుగా నరికి గదిలో రిఫ్రిజిరేటర్‌లో పెట్టడంతో దుర్వాసన వెదజల్లింది. దాదాపు 50 ముక్కలుగా నరికివేయబడింది.
Karnataka : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు మరో ఆరుగురిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదైంది. ఈ విషయాన్ని గురువారం పోలీసులు తెలియజేశారు.
కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాలతో హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.