Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad-Telangana ACB: “లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం”.. ఈ సూక్తి ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు కనిపిస్తుంది. ఇప్పటివరకు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితేనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేస్తారనే భావన ఉండేది. కానీ, అధికారులు అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినా నేరమేనని, జైలు శిక్ష తప్పదని తెలంగాణ ఏసీబీ సరికొత్త సంప్రదాయానికి నాంది పలికింది. కేవలం లంచం డిమాండ్ చేసినందుకు గాను బంజారాహిల్స్ సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) విజయ్ను అరెస్ట్ చేసి అవినీతి చరిత్రలో కీలక మలుపు తిప్పారు.
అసలేం జరిగింది?
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక చీటింగ్ కేసులో ఓ వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షల లంచం ఇవ్వాలని ఎస్సై విజయ్ డిమాండ్ చేశారు. అయితే సదరు వ్యక్తి అంత మొత్తం ఇవ్వలేకపోవడంతో, ఆగ్రహించిన ఎస్సై అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిబంధనల ప్రకారం అరెస్ట్ లేదని భావించిన కోర్టు, నిందితుడి రిమాండ్‌ను తిరస్కరించి అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, సదరు వ్యక్తిపై గతంలోనూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. ఆ పాత కేసుల పేరుతో అతన్ని మళ్లీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై విజయ్, మరోసారి నోటీసులు జారీ చేశారు. పాత కేసుల్లో అరెస్ట్ కాకుండా ఉండాలంటే మళ్లీ లంచం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో బాధితుడు అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని, సర్దుబాటు చేసి రూ.2 లక్షలు ఇస్తానని ఎస్సైతో ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు.
Also Read
- AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
- Suryakumar Yadav: "ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చా".. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
- Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
అనుమానంతో సెలవు.. కానీ తప్పని ఉచ్చు!
బాధితుడు డబ్బులు తెస్తానని చెప్పి వెళ్లిన తర్వాత ఎస్సై విజయ్‌కు ఏదో అనుమానం వచ్చింది. విషయం బయటకు పొక్కుతుందేమోనన్న భయంతో ఆయన హడావుడిగా సెలవు పెట్టి విధులకు దూరంగా వెళ్లిపోయారు. మరోవైపు ఎస్సై వేధింపులు భరించలేని బాధితుడు నేరుగా ఏసీబీ ఉన్నతాధికారులను ఆశ్రయించి, ఎస్సై విజయ్ తనను డబ్బులు డిమాండ్ చేసిన ఆధారాలను అందించాడు. ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ అధికారులు, డబ్బులు చేతికి అందకపోయినా ‘లంచం డిమాండ్ చేయడం’ (Demand of illegal gratification) కూడా అవినీతి నిరోధక చట్టం కింద తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. బాధితుడి వద్ద ఉన్న ఆధారాలను ప్రాథమికంగా నిర్ధారించుకున్న అనంతరం ఎస్సై విజయ్‌పై కేసు నమోదు చేసి, ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు.
ఉన్నతాధికారుల పాత్రపై ఆరా!
ఒక సాధారణ ఎస్సై స్థాయి అధికారి ఏకంగా రూ.10 లక్షల భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడం వెనుక స్టేషన్‌లోని ఉన్నతాధికారుల అండదండలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎస్సై వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై ఆధారాలు లభిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లంచం అడిగితే చాలు కటకటాలు లెక్కపెట్టాల్సి వస్తుందన్న ఏసీబీ సందేశం ప్రజల్లోనూ సరికొత్త విశ్వాసాన్ని నింపింది. ఈ ఘటనతో పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లంచం అడిగితే చాలు కటకటాలు లెక్కపెట్టాల్సి వస్తుందన్న ఏసీబీ సందేశం ప్రజల్లోనూ సరికొత్త విశ్వాసాన్ని నింపింది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
-
Suryakumar Yadav: “ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!