Robotic Elephant Donated by Shilpa Shetty and Raj Kundra couple: బాలీవుడ్ నటి శిల్పా షెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రాంభాపురి మఠానికి ఒక రోబోటిక్ ఏనుగును దానం చేశారు. ఈ రోబోటిక్ ఏనుగు మఠంలోని భక్తులకు సేవలందించడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం స్థానికంగా పెద్ద ఎత్తున జరగడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోబోటిక్ ఏనుగు గుడి కార్యక్రమాలకు, పవిత్ర ప్రాంతాలకు…
Karnataka : కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో బీతమ్మ గ్యాంగ్ ఆక్రమించుకోవడంతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాలతో హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం రాజకీయాలు కాస్లీగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు రూ. కోట్లు కుమ్మరిస్తున్నారు.
Monkey fever: కర్ణాటక రాష్ట్రంలో ‘మంకీ ఫీవర్’ వ్యాధి కలవరపెడుతోంది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ)గా పిలువబడే ఈ వ్యాధి బారిన పడి మరో వ్యక్తి మరణించాడు. చిక్కమగళూర్‌లో 43 ఏళ్ల వ్యవసాయ కూలీ బుధవారం ఉదయం మృతి చెందింది. కేఎఫ్‌డీ ఇన్‌ఫెక్షన్‌తో మహిళ ఫిబ్రవరి 21న శివమొగ్గలోని మెగాన్ హాస్పిటల్‌లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో 10 రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. మరోవైపు కేఎఫ్‌డీ వ్యాక్సిన్ల స్టాక్ అయిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఓ లాయర్‌పై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదం అయింది. ఇది పొలిటికల్ దుమారానికి తెరలేపింది.చిక్కమగళూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ లాయర్‌పై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రీతమ్ అనే న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా అతని బైక్ తాళాలను ట్రాఫిక్ పోలీసులు లాక్కున్నారు. ఈ ఘటన నవంబర్ 30న చోటు చేసుకుంది.