Covid Scam: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగిన కుంభకోణంపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. కోవిడ్ పరికరాలు, ఔషధాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపింది.
మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో తన పదవీకాలంలో రూ. 40,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఏ నాయకుడు ఏ విధంగా ఎంత డబ్బు సంపాదించాడో తనకు తెలుసన్నారు. ప్రభుత్వం కేవలం రూ.45 విలువ చేసే మాస్క్‌ను రూ.485కి కొనుగోలు చేసిందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల కోసం 10,000 పడకలు అవసరమని యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. పడకలను అద్దెకు…