Anasuya : హాట్ బ్యూటీ అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. తాజాగా తన కొత్త ఇంటి విషయాలను కూడా పంచుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంట్లో పూజలు చేసి రీసెంట్ గానే అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సుదీర్ఘమైన పోస్టు పెట్టింది సోషల్ మీడియాలో. మా కొత్త ఇంటికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది నా డ్రీమ్ హౌస్. ఎప్పటి నుంచో ఇలాంటి ఇంటిని కట్టుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు ఆ కల తీరిపోయింది.
Read Also : Keerthi Suresh : చీరకట్టులో కీర్తి సురేష్.. ఘాటు పెంచేసిందిగా..
నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయననే ఆరాధిస్తాను. మా నాన్న ఎప్పుడూ ఓ విషయం చెప్పేవారు. కష్టాల్లో ఉన్నా, సంతోషంగా ఉన్నా సరే హనుమాన్ అని అనుకోకుండా ఏదీ చేయద్దు అని. నేను కొత్త ఇంటికి సంజీవని అని పేరు పెడుదాం అనుకున్నా. హనుమాన్ ను ఆహ్వానించినట్టు ఉంటుదని. కానీ గురువు గారు చెప్పడంతో రామ సంజీవని అని పేరు పెట్టుకున్నా. ఎందుకంటే రాముడి లేని చోటు హనుమాన్ ఉండడు. ఆ పేరు పెట్టుకున్నందుకు స్వయంగా ఆ హనుమంతుడే మా ఇంటికి వచ్చాడని గురువు గారు ఫొటో చూపించడంతో ఆనందం తట్టుకోలేకపోయా. ఆ హనుమాన్ ను మా ఇంటికి ఆహ్వానించినట్టు అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. ఆమె పోస్టులో కొత్త ఇంట్లో అనసూయ ఎమోషనల్ అవుతున్న ఫొటోలను కూడా పంచుకుంది. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Pawan Kalyan : ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. పవన్ డైలాగ్ తో ఏస్ ట్రైలర్..