సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ కు తిరగులేదని మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలోనే ఎక్కవ సాఫ్ట్ వేర్ ఎగుమతి చేస్తున్న దేశంగా భారత్ కు పేరుంది. చాలా మంది ఇండియన్స్ సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సత్యనాదెళ్ల, సుందర్ పిచ్చాయ్ వంటి వారు ఇందుకు ఉదాహరణం.
ఇదిలా ఉంటే..టీసీఎస్ కోడ్ విటా సీజన్ 10 గ్లోబల్ కోడింగ్ పోటీలో విజేతగా ఇండియన్ నిలిచారు. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న కలాష్ గుప్తా ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 87 దేశాల నుంచి సుమారు లక్ష మంది ఈ కోడింగ్ పోటీలో పాల్గొన్నారు. కోడ్ విటా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీ.
ఈ పోటీల్లో ఇండియా తొలిస్థానంలో నిలవగా.. చిలీ, తైవాన్ కు చెందిన వారు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగో స్థానంలో చెక్ రిపబ్లిక్ కు చెందిన వ్యక్తి నిలిచారు. కలాష్ గుప్తా విజయంపై ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ అభినందించారు.
అయితే ఈ పోటీల్లో విజయం సాధిస్తానని అస్సలు ఊహించలేదని కలాష్ గుప్తా అన్నారు. 10, 000వేల డాలర్లు ఫ్రైజ్ మనీ కలాష్ గుప్తాకు లభించనుంది. రెండోస్థానంలో వారికి 7,000 డాలర్లు, మూడో స్థానం దక్కించుకున్న వారికి 3,000 డాలర్లు, నాలుగోస్థానంలో నిలిచిన వారికి 1000 డాలర్లు ప్రైజ్ మనీగా దక్కనుంది. కోడ్ విటాలో గెలుపొందిన నలుగురికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్( టీసీఎస్)లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గ్రూప్‌లో ఇంటర్న్‌షిప్ అందించబడుతుంది.