Piyush Goyal: భారతదేశ కంపెనీలు ఒకదాని వస్తువులు మరొకటి కొనుగోలు చేస్తూ సపోర్టుగా నిలవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. దీని వల్ల కరోనా మహమ్మారి లాంటి అవాంతరాలను ఎదుర్కోవచ్చు అన్నారు. భారతదేశాన్ని బ్రాండ్‌గా మార్చేందుకు కంపెనీలు ఒకదానికొకటి సహకారం అందించుకోవాలని సూచించారు. పరిశ్రమలు అంతర్జాతీయ వ్యాపారవేత్తలతో పాటు ఒకరికొకరు భాగస్వాములవ్వాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. దేశంలో ఇటీవల ఆమోదించిన 12 పారిశ్రామిక టౌన్‌షిప్‌లలో వ్యాపార అవకాశాలను పరిశీలించాలని ఇండియా ఇంక్‌కు పియూశ్ గోయల్ సూచించారు.
Read Also: Tamil nadu: నిట్ కాలేజీలో దారుణం.. ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. అరెస్ట్
కాగా, 2047 నాటికి దేశ అభివృద్ధిలో తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది అని కేంద్ర ఐటీమంత్రి పీయూశ్ గోయల్ అన్నారు. అయితే, గత 20 ఏళ్లుగా తయారీ రంగం 15- 20 శాతం జీడీపీ వృద్ధి రేటు మాత్రమే కలిగి ఉండగా.. ప్రస్తుతం దేశ జీడీపీ పెరుగుతున్నప్పటికీ.. తయారీ రంగం అదే స్థాయిలో ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కోణంలో ఆ స్థాయిని నిలబెట్టుకోవడం మంచిదే అయినప్పటికీ.. 1.4 బిలియన్ల జనాభా కలిగిన దేశం, ప్రతిభ, నైపుణ్యాలతో కాలేజీల నుంచి బయటకు వచ్చే యువతీ, యువకులకు దేశం చాలా ఇవ్వగలదని తాను భావిస్తున్నట్లు పీయూశ్ గోయల్ తెలిపారు.