MK Stalin: “ఇండియా గెలవాలి”.. లేదంటే మణిపూర్, హర్యానా గతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ అనే పోడ్‌కాస్ట సిరీస్ తొలి ఎపిసోడ్ లో బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందూ భాషల్లో విడుదలైన ఈ సిరీస్ లో స్టాలిన్ మాట్లాడుతూ.. గత 9 ఏళ్లలో బీజేపీ ఏ హామీని నెరవేర్చలేదని అన్నారు. ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమచేస్తానని చెప్పడం, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనే హామీ ఇవ్వడం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవేవీ జరగలేదని స్టాలిన్ విరుచుకుపడ్డారు.
భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాల కాకూండా నిరోధించాలంటే ‘ఇండియా కూటమి’ తప్పక గెలవాలని అన్నారు. మణిపూర్ జాతుల మధ్య ఘర్షణ, హర్యానా నూహ్ లో మతకలహాలను గురించి ప్రస్తావించారు. ప్రజలు ‘బహుళ సాంస్కృతిక, వైవిధ్యభరితమైన భారతదేశాన్ని రూపొందించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థల్ని స్నేహితులకు కట్టబెట్టడం, ఎయిర్ ఇండియాను అమ్మడాన్ని కప్పిపుచ్చుకునేందుకు మోడీ సర్కార్ మతవాదాన్ని ఆశ్రయించిందని ఆరోపించారు. పోర్టులు, విమానాశ్రయాలు తమకు దగ్గరగా ఉన్న కార్పొరేట్లకు మోడీ సర్కార్ కట్టబెట్టిందని విమర్శించారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ మరో ఘనత.. రెండోసారి చందమామపై ల్యాండింగ్.. ఇస్రో కొత్త వీడియో..
2002 గుజరాత్ అల్లర్లను కూడా స్టాలిన్ ప్రస్తావించారు. సామాజిక న్యాయం, సామాజిక సామరస్యం, సమాఖ్య, లౌకిక రాజకీయాలు, సోషలిజం పునరుద్ధరణ కోసం ఇండియా కూటమి ఏర్పడిందని, ఇండియా కూటమి గెలవకపోతే భారతదేశాన్ని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. ఫెడరలిజానికి ముప్పు వచ్చినప్పుడల్లా డీఎంకే ముందుంటుందని స్టాలిన్ అన్నారు.
మతం, కులం, భాషల ఆధారంగా దేశాన్ని విభజించేది డీఎంకే పార్టీ అని బీజేపీ ఎదురుదాడికి దిగింది. తమిళనాడుకు పన్ను ఆదాయంలో కేంద్ర తగిన ఆదాయం ఇచ్చిందని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి అన్నారు. డీఎంకేని ఉద్దేశిస్తూ కనీసం ఇప్పటికైనా స్టాలిన్ భారతదేశాన్ని ఒక దేశంగా ఒప్పుకున్నందుకు సంతోషం అని అన్నారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..