గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.
గత 24 గంటల్లో 25,920 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 492 మంది కరోనాతో మరణించారు. భారతదేశంలో రోజువారీ కోవిడ్-19 కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదైందని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి శుక్రవారం తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రోజువారీ సానుకూలత రేటు 2.07 శాతానికి తగ్గింది. భారతదేశంలో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2,92,092 ఉన్నాయి. గత 24 గంటల్లో 66,254 మంది కరోనా నుండి కోలుకున్నారు.