Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు మాత్రమే భయపడతారని డొనాల్డ్ ట్రంప్ కు చెప్పినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపాడు. ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ లతో ఇటీవల భేటీ అయిన విషయం గురించి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయాలనే బలమైన సంకల్పంతో ట్రంప్ ఉన్నారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధానికి ఎలా ముగింపు పలకాలనే అంశంపై తామంతా కలిసి డిస్కస్ చేశామన్నారు. పారిస్‌లో జరిగిన భేటీలో ఆ అంశం మీదే దృష్టి కేంద్రీకరించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
అయితే, రష్యా సైనిక సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడడమే మా లక్ష్యం అని జెలెన్ స్కీ తెలిపారు. ఇతర దేశాలు సాధించలేని వాటిని కూడా సాధించే సామర్థ్యం అమెరికాకు ఉంది.. ఈ యుద్ధాన్ని ముగించడంలో ముందడుగు వేయాలంటే మనలో ఐక్యత అవసరమని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. ఈ భేటీ ఏర్పాటు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Also: RGV Case : రామ్‌గోపాల్‌వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
ఇక, ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని తాము కోరుకుంటున్నట్లు ట్రంప్, మెక్రాన్ చెప్పారు. అలాగే, ఉక్రెయిన్‌లో మళ్లీ శాంతిని నెలకొల్పడంతో పాటు ప్రజల భద్రతపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి కృషి చేస్తామని అమెరికా, ఫ్రాన్స్ హామీ ఇచ్చాయి. అయితే, ఇప్పటికే పలుమార్లు తాను అమెరికా అధ్యక్షుడినైతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి 24 గంటల్లోనే ఆపేస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు.
Important international meetings took place today. The new Prime Minister of Estonia, Kristen Michal, made his first visit to Ukraine. We are grateful to Estonia for all its support and to all the Baltic states. One of the key topics discussed was brigade training.
Ukraine is… pic.twitter.com/1RCfOodX8m
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 9, 2024