INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.