INDIA Bloc: ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ముక్కలు..? ఒక్కోక్కరిగా బయటకు వెళ్తున్న నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఇండియా కూటమి ముక్కలు అవుతుందా..? ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు, బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కోవాలని దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ లక్ష్యం నెరవేరక ముందే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూటమిని వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఒంటరి పోరనే చెప్పింది.
తాజాగా బీహార్ రాజకీయాల్లో పరిణామాలు కూడా ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి సృష్టికర్తల్లో ఒకరిగా పేరున్న బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోసారి తన పాత మిత్రుడు బీజేపీతో జతకట్టేందుకు నితీష్ కుమార్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రధానమైన మూడు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల ముందే సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరిన సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంది. దీంతో అప్పటి నుంచి ఎస్పీ కూటమికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది.
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఈ నెల 29న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ బీహార్‌లోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో నితీష్ కుమార్ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌లకు పడటం లేదు. చివరకు రాహుల్ గాంధీ వయనాడ్‌లోనూ పోటీ చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, తృణమూల్ మధ్య చిచ్చుకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కారణమని టీఎంసీ ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ ఆరోపించారు. ఇండియా కూటమిని కూల్చేందుకు బీజేపీ తరుపున ఆయన పనిచేస్తున్నట్లు టీఎంసీ ఆరోపించింది.
Read Also: Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్‌ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?
5 రాష్ట్రాల ఫలితాలు, రామ మందిరమే మూడ్‌ని మార్చిందా..?
గతేడాది చివర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఇండియా కూటమిలో అభద్రతను పెంచాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ చేతుల్లో పెట్టింది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించింది బీజేపీ. తెలంగాణలో గెలిచినప్పటికీ, అది పూర్తిగా కాంగ్రెస్ గెలుపు కన్నా టీఆర్ఎస్ తప్పిదాలే అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మిజోరాంలో కూడా బీజేపీ అనుకూల ప్రభుత్వమే ఉంది.
2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజలు ముందు దేశ ప్రజల మూడ్‌ని తెలిపే ఎన్నికల్లో మరోసారి బీజేపీ సత్తా చాటడంతో కాంగ్రెస్ మీదు టీఎంసీ, జేడీయూ, ఆప్ వంటి పార్టీలు అపనమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతో బీజేపీ ఇప్పటికే దేశంలోని ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఇండియా కూటమిలో మాత్రం ఇంకా సీట్ల పంపకాలపై సయోధ్య కుదరడం లేదు. జేడీయూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!