Mahua Moitra: పార్లమెంట్ నుంచి మహువా మోయిత్రా బహిష్కరణ.. 6:4 తీర్పుతో ప్యానెల్ ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఆమెపై విచారణ జరిపింది. అంతకుముందు మహువా మోయిత్రాపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేను కూడా విచారించింది.
ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ మహువాపై చర్యలు తీసుకునేందుక సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదికను సిద్ధం చేసింది. ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తూ చేసిన సిఫారసులను ఫ్యానెల్ ఆమోదించింది. 6:4 మెజారిటీలో సభ్యులు తీర్పును ఆమోదించినట్లు తెలుస్తోంది. మహువాపై చర్యలు తీసుకోవాలని ఆరుగురు సభ్యులు మద్దతు తెలుపగా.. నలుగురు మాత్రం వ్యతిరేకించారు. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, హేయమైనవని, ఆమె నేరం చేసిందని చెబుతూ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్యానెల్ సూచించినట్లు తెలుస్తోంది. కమిటీ సిఫారసులను రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
మహువా మోయిత్రాపై చర్యలకు మద్దతు తెలిపిన సభ్యుల్లో అపరాజిత సారంగి, రాజ్‌దీప్ రాయ్, సుమేధానంద్ సరస్వతి, ప్రణీత్ కౌర్, వినోద్ సోంకర్, హేమంత్ గాడ్సే ఉన్నారు. వ్యతిరేకించి వారిలో డానిష్ అలీ, వి వైతిలింగం, పిఆర్ నటరాజన్, గిరిధారి యాదవ్ ఉన్నారు.
Read Also: Smartwatch Saves Life: జాగింగ్ చేస్తుండగా గుండెపోటు.. సీఈఓ ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్
పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ.. అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగారని, అందుకోసం వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె లంచం తీసుకుందని మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకుందని, వారు దుబాయ్ కేంద్రంగా లాగిన్ అయ్యారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పీకర్ ఓంబిర్లాతో పాటు ఐటీ శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ లకు దూబే లేఖలు రాశారు.
మరోవైపు దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్ ముందు ఈ ఆరోపణపై అఫిడవిట్ సమర్పించారు. తన నుంచి మహువా మోయిత్రా గిఫ్టులు, ఇతర సహాయాలు తీసుకుందని అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఎథిక్స్ ప్యానెల్ కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, ఐటీ మంత్రిత్వశాఖల నుంచి నివేదికలు తెప్పించుకుని మహువా మోయిత్రాను విచారించింది.
తాజావార్తలు
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!