AAP: ఈసారి మోడీ గెలిస్తే “నరేంద్ర పుతిన్” అవుతాడు.. సీఎం హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం మహా ర్యాలీ నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిర్వహించిన మహార్యాలీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై కేజ్రవాల్ విరుచుకుపడ్డాడు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిచి మళ్లీ మోడీ ప్రధాని అయిీతే అతను ‘‘నరేంద్ర పుతిన్’’ అవుతారని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పోలుస్తూ నియంతలా మారుతారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు మోడీని ‘రాజు’గా పరిణించడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు దేశాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటేనే, దేశం రక్షించబడుతుందని మాన్ వ్యాఖ్యానించారు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: CM Kejriwal : సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రజల తరఫున జరిగిన 8 ఏళ్ల పోరాటం ఫలించింది
గత నెలలో ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా.. సివిల్ సర్వెంట్ల నియామకం, బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు తరువాత కేంద్రం బదిలీలు, నియామకాలపై కొత్తగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ మధ్య ఘర్షణ మొదలైంది. ఆరు నెలల్లో ఆర్ఢినెన్సును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలి. అయితే ప్రస్తుతం లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. రాజ్యసభలో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతిపక్షాల సాయం కోరుతున్నారు.
తాజాగా ఆదివారం ఆప్ ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ‘మహా ర్యాలీ’ నిర్వహించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ఆప్ నేత, మంత్రి గోపాల్ రాయ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ర్యాలీలో ప్రసంగించారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పునరాలోచించాలని, ఢిల్లీ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆప్ పేర్కొంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!