12 ఏళ్ల క్రితం అవినీతికి వ్యతిరేకంగా రాంలీలా మైదాన్‌లో సమావేశమయ్యామన్నారు సీఎం కేజ్రీవాల్. ఇప్పుడు నియంతృత్వానికి వ్యతిరేకంగా సభ జరుపుకుంటున్నామన్నారు. ఇప్పుడు మొదలయ్యేది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమమన్నారు. ఈ ఉద్యమం కూడా విజయం సాధిస్తుంది. సభకు వచ్చిన ప్రతి ఒక్కరు మీ మొబైల్ ఫోన్లు తీసి ఫేస్‌బుక్ లైవ్ పెట్టండని, సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రజల తరఫున జరిగిన 8 ఏళ్ల పోరాటం ఫలించిందన్నారు కేజ్రీవాల్. అంతేకాకుండా.. ‘మే 11న రాజ్యాంగ ధర్మాసనం అధికారుల బదిలీలపై కీలక తీర్పునిచ్చింది. మే 19న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.
Couple’s Death: ఫోటో షూట్లో బోటు బోల్తా పడి చనిపోయిన హనీమూన్ కపుల్స్
తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను తాను పాటించబోనని చెబుతున్నారు. ఇది హిట్లర్ తరహా నియంతృత్వం కాక మరేంటి? ప్రజాస్వామ్యానికి ముగింపు కాక మరేంటి? ప్రజాస్వామ్యం, ప్రజాశక్తి సర్వోన్నతమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పనిచేసే హక్కు ఉండాలి. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా తానే నడపాలని మోదీ అనుకుంటున్నారు. బీజేపీ నేతల తిట్లకు, విమర్శలకు నేను కూడా అదే రీతిన బదులివ్వగలను. కానీ అది నా సంస్కృతి కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును మాత్రం వ్యతిరేకిస్తూనే ఉంటాను. దేశమంతా తిరుగుతున్నాను. ప్రతిపక్ష నేతలను కలుస్తున్నాను. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఈ ఆర్డినెన్సును వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు. ఇది కేవలం ఢిల్లీ విషయం మాత్రమే కాదు. కేవలం ప్రారంభం మాత్రమే రేపు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు కూడా ఇదే ఆర్డినెన్సు తీసుకొస్తారని తెలిసింది. కాబట్టి మనమంతా వీధుల్లో నిరసన తెలపాలి.
Former Chief Justice Eswaraiah : బీసీలకు జనగణన లేదనడం హాస్యాస్పదంగా ఉంది
ఢిల్లీ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 7 సీట్లు ఇచ్చారు. అలాగే అసెంబ్లీలో 70కి 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. తద్వారా ఢిల్లీ ప్రజలు దేశాన్ని మోదీ చూసుకోవాలని, ఢిల్లీ రాష్ట్రాన్ని కేజ్రీవాల్ చూసుకోవాలని స్పష్టమైన తీర్పునిచ్చారు. కానీ మోదీ కళ్లు నెత్తికెక్కాయి. అందుకే ఆర్డినెన్సు తీసుకొచ్చి ఢిల్లీలో జోక్యం చేసుకుంటున్నారు. పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లు, యోగా క్లాసులు, సీసీటీవీల ఏర్పాటు కోసం లెఫ్టినెంట్ గవర్నర్‌ని సంప్రదిస్తే అన్నింటినీ ఆపేశారు. మోదీ దేశాన్ని చూసుకోవాలి. దేశంలో ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారంటే మంచి స్కూళ్లను పెట్టారని చెప్పుకుంటారు.
మోదీజీ గుజరాత్‌లో ఏం చేశారంటే స్కూల్లో ఫొటోలు తీయించుకుందాం అనుకుంటారు. 30 ఏళ్ల బీజేపీ హయాంలో గుజరాత్‌లో మంచి స్కూల్ దొరక్క, స్టూడియో ఫేక్ స్కూల్ తయారు చేయించాల్సి వచ్చింది. అందుకే కేజ్రీవాల్‌ను అస్సలు పనిచేయనీయవద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను జైల్లో పెట్టారు. ఇంకా ఎంత మందిని జైల్లో పెడతారు? మా అందరినీ జైల్లో పెట్టండి. అప్పటికీ మనసు తృప్తి చెందకపోతే అప్పుడు ఈ ఆర్డినెన్సు తీసుకురండి. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లను జైల్లో పెట్టారు. మా దగ్గర 100 మంది సిసోడియాలు, 100 మంది సత్యేందర్ జైన్లు ఉన్నారు’ అని ఆయన అన్నారు.